ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడి పాత్ర కూడా ముఖ్యమే.. ఈ పాత్రలకు సరైన నటుల ఎంపిక లోనే సగం సినిమా విజయం దాగి ఉంటుంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే..హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది.
Video Advertisement
హీరో హీరోయిన్ ఏ విధంగా అయితే ప్రేక్షకులను అలరిస్తారో అదే రేంజ్ లో ప్రతి నాయకుడి పాత్ర కూడా ఉంటుంది.. ఇక పారితోషికం విషయానికి వస్తే విలన్స్ కి చాలా తక్కువగా ఉండేది. అయితే దీనిపై చాలామంది విలన్స్ వారితో సమానంగా మాకు ఎందుకు పారితోషకం ఇవ్వకూడదని ప్రశ్నలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రతినాయకుడి పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి వారికీ కూడా భారీ పారితోషికం ఇస్తున్నారు నిర్మాతలు..
ప్రస్తుతం వస్తున్నా సినిమాల్లో చాలామంది దర్శకులు హీరోలను ఏ విధంగా అయితే హైలెట్ చేస్తున్నారో, విలన్స్ ని కూడా అదే విధంగా హైలెట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది స్టార్ విలన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.. సోనూసూద్,ప్రకాష్ రాజ్,జగతిబాబు లాంటివాళ్ళకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు విలన్ గానే కాకుండా ఏ పాత్ర వచ్చినా అందులో నటించడమే కాకుండా జీవించేస్తారు.
మరి ఇండస్ట్రీలో అలా భారీ పారితోషికం తీసుకునే విలన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 ప్రకాష్ రాజ్
విలన్ పాత్రల నుంచి, తండ్రి, సహాయనటుడు.. ఏ పాత్రకైనా న్యాయం చేసే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఈయన ఒక రోజుకు పది లక్షలకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక కొన్ని సినిమాలకు అయితే కోటిన్నర వరకు తీసుకుంటారట.
#2 జగపతి బాబు
ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువైన జగపతి బాబు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఆయన పారితోషికం కోటి నుంచి కోటిన్నర ఉంటుంది.
#3 శ్రీకాంత్
మొదట్లో నెగటివ్ రోల్స్ చేసి హీరోగా ఎదిగిన శ్రీకాంత్. మళ్ళీ నెగటివ్ రోల్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈయన కూడా కోటి కి పైగానే పారితోషికం తీసుకుంటారట.
#4 సోనూ సూద్
చాలా మంది హీరోలు సినిమాల్లో మాత్రమే హీరో గా కనిపిస్తారు. కానీ సోనూసూద్ మాత్రం రియల్ లైఫ్లో కూడా హీరోనే.. ఈయన ఒక సినిమాకు మూడు కోట్ల వరకు తీసుకుంటారట.
#5 ఆది పినిశెట్టి
హీరోగా, సహాయ నటుడిగా చేసే ఆది ..స్టైలిష్ విలన్ల లో ఒకరు. ఈయన కూడా కోటికి పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారట
#6 మిర్చి సంపత్ రాజ్
మిర్చి సినిమాతో స్టార్ విలన్ గా ఎదిగాడు సంపత్ రాజ్. ఈయన ఒక సినిమాకు 40 లక్షల పైగానే పారితోషికం అందుకుంటారట.
#7 రావు రమేష్
విలన్ గా, సహాయ నటుడిగా మనల్ని అలరించే రావు రమేష్ ఒక సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటారట.
#8 విజయ్ సేతుపతి
చిన్న చిన్న పత్రాలు వేస్తూ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి కి అన్ని భాషల్లోనూ అభిమానులున్నారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా.. ఒక్క పాత్రేంటి.. ఎలాంటి రోల్ అయినా అందులో చించేయగల సత్తా ఉన్న యాక్టర్ ఆయన. అందుకే ఆయనకు అంత డిమాండ్ ఉంటుంది.
ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాల్లో విలన్ గా చేస్తున్న విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు 15 కోట్లకు పైగానే తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.