ఓ సినిమాకు హీరో దర్శకుడితో పాటు మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. సంగీతం సరిగ్గా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే.. దేవిశ్రీ ప్రసాద్, తమన్. వీరిద్దరూ గత కొంతకాలం గా టాలీవుడ్ ని ఏలుతున్నారు. వారు మ్యూజిక్ అందించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతుండటం తో వారి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Video Advertisement

 

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఒక పాట విడుదలైదంటే.. యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్‌ చేయాల్సిందే. అంతలా తన మ్యూజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తాడు డీఎస్సీ. కేవలం ఆయన అందించిన సంగీతంతోనే సూపర్‌ హిట్‌ అయినా సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఆయనకు టాలీవుడ్‌లో చాలా డిమాండ్‌ ఉంది. సాధారణంగా దేవిశ్రీ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. కానీ రానున్న చిత్రానికి ఏకంగా రూ. 5 కోట‍్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం.

remunartions of that two star music directors..

మరోవైపు థమన్ ఏడాదికి 15 సినిమాల వరకు చేస్తున్నాడు. అతడు మ్యూజిక్ ఇచ్చిన మూవీ అన్ని సూపర్ హిట్స్ అవుతున్నాయి. గతేడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాలో తమన్ సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక మొన్నటికి మొన్న అఖండ సినిమా విజయంలో 50 శాతం థమన్ ఒక్కడే తీసుకున్నాడు. మొన్నటి వరకు లక్షల్లోనే ఉన్న ఈయన పారితోషికం ఇప్పుడు కోట్లలోకి వెళ్లిపోయింది. చిన్న సినిమాలకు తక్కువగానే తీసుకుంటున్నాడు థమన్. పెద్ద సినిమాల వరకు మాత్రం బాగానే వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఈయన 1.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

remunartions of that two star music directors..

అయితే తాజాగా వీరిద్దరూ రిలీజ్ చేసిన స్టార్ హీరోల సాంగ్స్ వచ్చాయి. జనాల్లోకి సూపర్ గా వెళ్తున్నాయి కానీ, ట్రోల్స్ కూడా అలాగే వస్తున్నాయి. దీంతో ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు తప్ప పెద్ద సినిమాలకు వేరే ఆప్షన్ లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ కాపీ ట్యూన్ లు అందించేందుకు స్టార్ హోటళ్లలో ఖరీదైన అకామిడేషన్లు, కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్లు వీరికి అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.