‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’.. ఇప్పుడు దక్షిణాది మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుతోంది. మణిరత్నం తెరకెక్కంచిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. పదో శతాబ్దం లోని చోళరాజుల ఇతివృత్తం తో ఈ సినిమాని రూపొందించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’.. ఇక ఈ చిత్రం లో ఐష్ ది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. తాను ప్రేమించిన పాండ్య రాజును తన కళ్ళ ముందే ఒక చోళ రాజు ఆదిత్య కారికలాన్ చంపుతాడట. ప్రేమించిన

Video Advertisement

వారిని చంపిన వారిపై నందిని ఎలా ప్రతీకారం తీర్చుకుంది అన్నదే చాలా ఆసక్తిగా తెరకెక్కించాడట మణిరత్నం. చోళుల ఇతివృత్తంగా కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష తదితరులు నటిస్తున్నారు. మణిరత్నం కలల ప్రాజెక్టు అయిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఆయా పాత్రలకు ఆ నటులు ఎంత తీసుకున్నారో తెలుసుకుందాం

#1 ప్రకాశ్‌రాజ్‌

ponniyin selvan charecters remunaration
చోళ సామ్రాజ్యానికి రాజు సుందర చోళుడు. ఆయనకు ముగ్గురు బిడ్డలు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో సుందర చోళుడి పాత్రను ప్రకాశ్‌రాజ్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రకాశ్‌రాజ్‌ రూ. కోటి తీసుకుంటున్నారట.

#2 విక్రమ్

ponniyin selvan charecters remunaration
సుందర చోళుడి పెద్ద కుమారుడు చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్‌ కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన రూ. 12 కోట్లు తీసుకున్నారని టాక్‌.

#3 త్రిష

ponniyin selvan charecters remunaration
రాజకుమారి కుందవై పాత్రలో త్రిష నటిస్తున్నారు. ఈమెకు రూ. 2.5 కోట్లు ఇచ్చారట.

#4 జయం రవి

ponniyin selvan charecters remunaration
సుందర చోళుడి చిన్న కుమారుడు అరుళ్‌మోళి వర్మన్‌. ఇతడినే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని కూడా పిలుస్తారు. అరుళ్‌మోళి వర్మన్‌గా జయం రవి కనిపించనున్నాడు. ఈయన రెమ్యూనరేషన్‌ రూ. 8 కోట్లు అని సమాచారం.

#5 కార్తి

ponniyin selvan charecters remunaration
ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు వల్లవరాయన్‌ వందిదేవన్‌. ఈ పాత్రలో కార్తి నటిస్తున్నాడు. దీని కోసం కార్తి రూ. 5 కోట్లు అందుకున్నారట.

#6 ఐశ్వర్య రాయ్‌

ponniyin selvan charecters remunaration
పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రపంచంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్ర నందిని. ఈ పాత్రను ఐశ్వర్యరాయ్‌ చేస్తున్నారు. ఈ పాత్రకు ఆమెకు రూ. 10 కోట్లు ఇచ్చారట.

#7 ఐశ్వర్యా లక్ష్మీ

ponniyin selvan charecters remunaration
పూంగుళలిగా ఐశ్వర్యా లక్ష్మీ నటించింది. పడవ నడిపే యువతిగా కనిపించే ఈమె రూ. 1.5 కోట్లు అందుకుంటోందట.