ఓ సినిమాకు హీరో దర్శకుడితో పాటు మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. సంగీతం అందర్నీ ఆకట్టుకునేట్టుగా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. సినిమాకి సంగీతం అనేది ఒక బలమైన అంశం. సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా అంతే బలంగా ఉంటేనే సినిమా సీన్స్ అనేవి తెరపై బాగా కనిపిస్తాయి. అయితే మనకి అద్భుతమైన సంగీతాన్ని అందించే ఆ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1 ఏఆర్ రెహమాన్
మ్యూజిక్ లెజెండ్ రెహ్మాన్ ఎన్నో అద్భుతమైన పాటలను సినీ ప్రపంచానికి అందించారు. రెండు ఆస్కార్ అవార్డుల తో పాటు ఎన్నో అవార్డులను తన ఖాతా లో వేసుకున్న రెహమాన్ ఒక సినిమాకి 5 కోట్ల రూపాయలకు పైనే తీసుకుంటారు.
#2 దేవి శ్రీ ప్రసాద్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఒక పాట విడుదలైదంటే.. యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేయాల్సిందే. అంతలా తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తాడు దేవి. సాధారణంగా దేవిశ్రీ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం.
#3 ఎంఎం కీరవాణి
భారత దేశానికి తొలి ఆస్కార్ తెచ్చిన కీర్తి కిరీటి కీరవాణి గారు ఒక చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.
#4 మణిశర్మ
కొన్ని దశాబ్దాలు పాటు తెలుగు పరిశ్రమను ఏలిన ఈయన చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.
#5 తమన్
ఏడాదికి 15 సినిమాల వరకు చేస్తున్న తమన్.. తన మ్యూజిక్ తో సినిమాల విజయం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిన్న సినిమాలకు తక్కువగానే తీసుకుంటున్న తమన్ పెద్ద సినిమాలకు ఈయన 1.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
#6 అనిరుధ్
ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో చిత్రానికి 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటారు.
#7 గోపి సుందర్
ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించే గోపి సుందర్ ఓ చిత్రానికి సుమారు 50 నుండి 80 లక్షలు తీసుకుంటున్నారు.
#8 మిక్కీ జే మేయర్
దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ఎన్నో మ్యాజికల్ సాంగ్స్ కు ఊపిరి పోసిన ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 75 లక్షలు తీసుకుంటున్నారు.
#9 హారిస్ జయరాజ్
ఎన్నో లవ్ సాంగ్స్ కు కర్త ,కర్మ,క్రియ అయిన హారిస్ ఓ చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు పారితోషికం గా తీసుకుంటున్నారు.
#10 జి.వి.ప్రకాష్
అటు హీరోగా ఇటు మ్యూజిక్ కంపోజర్ గా బిజీగా ఉన్న జి.వి.ప్రకాష్. ప్రస్తుతం చిత్రానికి 60 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారు.
#11 అనూప్ రూబెన్స్
ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన అనూప్ ఒక్కో చిత్రానికి 40 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారు.
#12వివేక్ సాగర్
చిన్న చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ అందరినీ అలరిస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ వివేక్ సాగర్ ఓ చిత్రానికి 40 నుండి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.