తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో ఎవరు? అంటే దానికి టక్కున సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది హీరోలు మరో సినీ పరిశ్రమలో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారే సపరేట్ ఫ్యాన్ బేస్ తో, సపరేట్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మన హీరోలు ఇప్పుడు ప్రపంచమంతా తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఈ మధ్యకాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ సక్సెస్ లను అందుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ అందుకుంటున్నారు.
Video Advertisement
అయితే సినిమా సినిమా కి తమ మార్కెట్ ని పెంచుకొనే హీరోలు అదే జోష్ లో తమ రెమ్యూనరేషన్ కి కూడా పెంచేస్తున్నారు. అయితే ఇప్పుడు మన స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో చూద్దాం..
#1 ప్రభాస్
రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ వచ్చినప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అయితే అసలు తగ్గలేదు. ప్రభాస్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు పైనే పారితోషికం అందుకుంటున్నాడు. తన 25వ సినిమాగా రూపొందుతున్న స్పిరిట్ కోసం అయితే ఏకంగా 150 కోట్ల వరకు అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
#2 రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ తర్వాత ఫుల్ ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం రూ.100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
#3 మహేష్ బాబు
ఇక ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.
#4 జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు రూ. 45 కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక తన తదుపరి కోసం రూ. 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్.
#5 పవన్ కళ్యాణ్
పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పవన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి డేట్లు ఎక్కువ కేటాయించాల్సి రావడంతో మరో 10 కోట్లు అదనంగా తీసుకున్నారని సమాచారం.
#6 చిరంజీవి
ఆచార్యకు రామ్ చరణ్ నిర్మాత కాబట్టి చిరు రెమ్యునరేషన్ లెక్కలు తేలడం లేదు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆయన రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.
#7 అల్లు అర్జున్
పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన అల్లు అర్జున్.. పుష్ప 2 కోసం 60 కోట్ల నుంచి 100 వరకు తీసుకుంటున్నారని సమాచారం.
#8 రవితేజ
క్రాక్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పెరిగింది.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ కోసం రూ. 13 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్. ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం రూ. 15 కోట్లకు పైనే తీసుకున్నారట రవితేజ.
#9 నాని
వరస ఫ్లాపుల కారణంగా నాని రేంజ్ కాస్త తగ్గింది.. ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలున్నాయి.. అయితే శ్యామ్ సింగరాయ్ తర్వాత మళ్లీ రూ. 10 కోట్లకు చేరుకున్నాడు నాని.
#10 బాలకృష్ణ
అఖండ కోసం బాలయ్య రూ. 11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన వీర సింహ రెడ్డి చిత్రం కోసం బాలయ్య 15 కోట్ల రూపాయల వరకు పారితోషికం పెంచినట్లు తెలుస్తుంది.
#11 వెంకటేష్
గతం లో మార్కెట్ వేల్యూ తగ్గడం తో వెంకటేష్ ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు వరకు తీసుకున్నారు. అయితే ఎఫ్ 2 చిత్రం హిట్ కావడం తో ఎఫ్ 3 కోసం రూ 15 కోట్ల వరకు తీసుకున్నట్టు టాక్.
#12 నాగార్జున
నాగార్జున కూడా ఒక్కో సినిమాకు రూ. 7 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్.
#13 విజయ్ దేవరకొండ
వరస ఫ్లాపులు వస్తున్నా విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం..రీసెంట్‌గా లైగర్ సినిమాకు రూ. 15 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.