భారతదేశంలోని 5 అత్యంత ధనిక దేవాలయాలు ఇవే..! తిరుపతి కంటే ధనిక దేవాలయం ఏదో తెలుసా..?

భారతదేశంలోని 5 అత్యంత ధనిక దేవాలయాలు ఇవే..! తిరుపతి కంటే ధనిక దేవాలయం ఏదో తెలుసా..?

by Mounika Singaluri

భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. హిందూ ధర్మాన్ని భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా భారతదేశం అంతా హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయాల్లో ఎప్పుడు చూసినా భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. ఒడిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ లోనే 500 దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల నీటిని భారతదేశ వారసత్వ సంపదగా భావిస్తూ ఉంటారు.

Video Advertisement

తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించడానికి భక్తుల ఆలయాన్ని సందర్శిస్తారు. కోరిక నెరవేరినప్పుడు, భక్తులు వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా విరాళాలు ఇస్తారు. దేశంలోని సంపన్న దేవాలయాలుగా పేరొందిన దేవాలయాల గురించి మీకు తెలుసా…?

richest temple in india

పద్మనాపస్వామి దేవాలయం: ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం పూర్తిగా శ్రీ హరివిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ దేవాలయం మొత్తం ఆస్తి విలువ 1,20,000 కోట్లు. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఇది మొదటి ఆలయం.

richest temple in india

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది దేశంలోని రెండవ అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా ఉంది. లెక్కలేనంత బంగారం, 14 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.

british rules in tirupati

షిర్డీ సాయిబాబా ఆలయం: షిర్డీ సాయిబాబా ఆలయం గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్క బాబా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే ఈ ఆలయ వార్షిక ఆదాయం సుమారు రూ.1800 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

richest temple in india

వైష్ణో దేవి ఆలయం: వైష్ణో దేవి ఆలయం కాశ్మీర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో 52,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక గుహ దేవాలయం. భక్తుల కోర్కెలు వెంటనే తీర్చే అమ్మను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం రూ.500 కోట్లు విరాళాలు అందుతాయి.

richest temple in india

సిద్ధివినాయక ఆలయం : ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం దేశంలోని ఐదవ అత్యంత ధనిక దేవాలయం. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. అలాగే శ్రీ వినాయకుని దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సంవత్సరానికి రూ.125 కోట్ల ఆదాయం వస్తుంది.

richest temple in india


You may also like

Leave a Comment