Ads
ఒక కుటుంబానికి చెందిన వారి మధ్య ఎంత ప్రేమ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. అందులో ఒకటి ఆస్తి విషయం. ఆస్తి పంపకం విషయంలో గొడవలు అవ్వడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఇద్దరు సంతానం ఉంటే, వారిలో తల్లిదండ్రుల బాధ్యత ఒకరిని ఎక్కువగా తీసుకొని, ఒకరు తక్కువగా తీసుకుంటే, అప్పుడు ఆస్తి విషయంలో కచ్చితంగా గొడవలు అవుతాయి.
Video Advertisement
తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్న వారికి ఎక్కువ ఆస్తి రావాలని, బాధ్యత తీసుకోని వారికి తక్కువ ఆస్తి రావాలని చర్చలు జరుగుతాయి. ఇది అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, లేకపోతే సోదరీ సోదరుల మధ్య అయినా అవ్వచ్చు. ఒకవేళ సోదరి ఉంటే, తనకి పెళ్ళి వెళ్లిపోయిన తర్వాత తండ్రి ఆస్తిపై ఎంత హక్కు ఉంటుంది అనే విషయంపై ఇప్పటికి కూడా మనకు అంత స్పష్టత లేదు. పెళ్లయిన కూతురికి తన తండ్రి ఆస్తి మీద ఎంత హక్కు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆస్తి హక్కుకి సంబంధించిన చట్టం 1956 వరకు ఒక లాగా ఉంది. ఆ సంవత్సరానికి అంటే 1956 కంటే ముందు పుట్టిన ఆడపిల్లలకు ఒక రకమైన చట్టం ఉంది. సెప్టెంబర్ 9, 2005 లో మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అప్పట్లో తండ్రిని చూసుకోవడానికి కొడుకులే ఉండేవాళ్ళు. సాధారణంగా కూతురు పెళ్లి చేసుకొని వెళ్లిపోయేవారు. అందుకే 1956 కంటే ముందు పుట్టిన ఆడ పిల్లలకి తండ్రి ఆస్తిలో వాటా లేదు.
తర్వాత స్త్రీ పురుషుల మధ్య భేదాన్ని రూపుమాపడానికి సుప్రీంకోర్టు నడుంబిగించి 2005 లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ వారసత్వ చట్టంలో సవరణలు చేసి ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అదేంటంటే 2005 తర్వాత నుంచి వచ్చిన చట్టం ప్రకారం తండ్రి ఆస్తిపై, అలాగే తండ్రి యొక్క అప్పులపై కూతురికి, కొడుకుకి సమానమైన హక్కు ఉంటుంది. ఇదే చట్టాన్ని ఇప్పటికి కూడా పాటిస్తున్నారు.
కానీ 1956 కంటే ముందు పుట్టిన ఆడవాళ్ళకి తన తండ్రి ఆస్తిలో వాటా రాదు. వారు ఇప్పుడు క్లెయిమ్ చేయాలి అనుకున్నా కూడా వారికి వాటా లేదు. అంతే కాకుండా వారికి వివాహం జరిగిన సంవత్సరాన్ని బట్టి ఆస్తి వాటా గురించి నిర్ణయిస్తారు. 1986 కంటే ముందు పెళ్లి అయిన వారి పరిస్థితి ఒక రకంగా ఉంది. 1986 తర్వాత పెళ్లి అయిన వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. ఈ విషయం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
watch video :
https://youtu.be/pEHxXgfTDDk
NOTE : All images used are only for representative purpose.
End of Article