కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటక ఆదివాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో రిషబ్ నటన సినిమాకే హైలైట్.

Video Advertisement

 

 

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. సుమారు 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సుమారు 400 కోట్ల రూపాయలు దక్కించుకుంది. కాంతార సినిమాకి ముందు రిషబ్ శెట్టి గురించి కేవలం కన్నడ ప్రజలకి మాత్రమే తెలుసు. ఇప్పుడు కేవలం ఒక్కటంటే ఒక్క సినిమాతో రిషబ్ దేశ వ్యాప్తం గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. కన్నడలోనే కాకుండా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది.

rishab shetty remunaration for kanthaara movie..??

ఈ సినిమాలో హీరో, దర్శకుడిగా రిషబ్ శెట్టి అందర్నీ మెప్పించారు. ఈయన నటనకు సెలెబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం రిషబ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఆసక్తికరం గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమాకు కేవలం 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్ అయిన తర్వాత మరో అయిదు కోట్ల రూపాయలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటని క్లారిటీ రావాల్సి ఉంది.

rishab shetty remunaration for kanthaara movie..??

మొత్తానికి కాంతార చిత్రం తో రిషబ్ శెట్టి కి దక్కింది కొంచమే అయినా.. వచ్చిన పేరు మాత్రం చాలా ఎక్కువే అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కర్ణాటక లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు రిషబ్ గతం లో తెలిపారు. కాంతార మూవీ చూసిన సూపర్ స్టార్ రజని కాంత్ రిషబ్ శెట్టి నటనకు ముగ్ధుడై.. తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు.