బుల్లి తెర పై నటి & యాంకర్ శ్రీముఖి పాపులారిటీ అంత ఇంతా కాదు..ఒక చిన్న సెలబ్రిటీ ఫంక్షన్ కి యాంకరింగ్ అయినా ఒక పెద్ద హీరో ఆడియో ఫంక్షన్ లేదా ఇంటర్వ్యూ అయినా శ్రీముఖి పక్కా ఉంటారు. అంతే కాదు యాంకర్ సుమ తరువాత అంతటి పాపులారిటీ ని సంపాదించిన శ్రీ ముఖి.. అటు సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసిన శ్రీ ముఖి రన్నర్ అప్ గా నిలిచారు.

srimukhi new

స్టేజి పై ఈవెంట్లలో కూడా శ్రీముఖి సందడి మాములుగా ఉంటుంది. తాజాగా.. కృష్ణాష్టమి పండుగ కోసం జీ తెలుగు ఛానెల్ వారు ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. దీనికి శ్రీముఖి నే యాంకర్ గా చేసారు. ఈ ఈవెంట్ లో ఆర్టిస్ట్ రియాజ్ శ్రీముఖి గా నటిస్తూ ఓ స్పూఫ్ స్కిట్ ను వేశారు. ఇది హైలైట్ గా నిలవబోతోంది అని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఈ స్కిట్ లో శ్రీముఖి కి పడిన పంచ్ లు అన్ని ఇన్ని కాదు. రియాజ్ ఇమిటేషన్ అయితే వేరే లెవల్ లో ఉంది. చివరకు శ్రీముఖి.. “నన్ను ఎంతో మంది ఇమిటేట్ చేసారు.. ఫస్ట్ టైం చచ్చిపోవాలనిపించింది రా..” అనేసింది. దీన్ని బట్టి రియాజ్ శ్రీముఖి ఏ రేంజ్ లో ఆడేసుకున్నాడో అర్ధం అయిపోతోంది కదా.. ఈ ప్రోమో ను మీరు కూడా చూసేయండి.

Watch Video: