సెలెబ్రెటీలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. సెలెబ్రిటీ కిడ్స్ పై కూడా ఒకలాంటి క్యూరియాసిటీ ఉంటుంది. సెలెబ్రిటీల పిల్లలు ఎలా ఉంటారు..? వారి లైఫ్ స్టయిల్ పైనా.. వారు అభిమానులతో రియాక్ట్ అయ్యే విధానం పైన కూడా చాలామందికి ఆసక్తి ఉంటుంది. సెలెబ్రిటీ కిడ్స్ కి కూడా సోషల్ మీడియా లో కొంత ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. వారు ఫాలోయర్స్ తో మెలిగే విధానాన్ని బట్టి ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది.

anshu 2

బుల్లితెర రాణి రోజా కు ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. రోజా కు ఓ కూతురు, కొడుకు ఉన్నారన్న సంగతి విదితమే. అప్పుడప్పుడు ఈవెంట్ లకు కూడా వీరిద్దరూ హాజరు అవుతూ ఉంటారు. అయితే.. రోజా, ఆమె కూతురు అన్షు ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. అయితే.. అన్షు మాత్రం ఇప్పటివరకు తల్లి చాటు పిల్ల గానే ఉంది..

anshu 4

తాజాగా అన్షు కూడా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైం లోనే ఆమెకు ఫాలోవర్స్ కూడా పెరిగారు. తాజాగా.. ఆమె అభిమానులతో ముచ్చటించడం కోసం చాట్ సెషన్ ను రన్ చేసింది. ఈ టైం లో ఓ కొంటె అభిమాని అన్షు కు ఐ లవ్ యు అని స్పానిష్ భాష లో మెసేజ్ చేసాడు. దానికి అన్షు కూడా స్పానిష్ లాంగ్వేజ్ లోనే ఐ లవ్ యు అని చెప్పేసింది.

anshu 3

ఇంకా.. కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చింది. యు ట్యూబ్ ఛానల్ పెట్టె ఉద్దేశ్యం ఉందా అని ఓ నెటిజెన్ అడగ్గా.. “మీరు చెప్పండి.. నాకు అయితే పెట్టాలనే ఉంది..” అంటూ ఫాలోవర్స్ ఒపీనియన్ ను అడిగింది. వ్యాపారం చేసే ఉద్దేశ్యం ఉందా అని అడుగగా..తనకు “anshoe ” పేరిట షూ బిజినెస్ చేయాలని ఉందని చెప్పింది. హీరోయిన్ అవుతారా.. ? అని మరొకరు అడగ్గా.. తనకు తెలియదని, ఇప్పటివరకు అలా ఆలోచించలేదని చెప్పుకొచ్చింది.