ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ మారుమోగిపోతుంది. నాటు నాటు పాటకు ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకొని ఈ సినిమా చరిత్రను సృష్టించింది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్‌బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Video Advertisement
ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయిన ఈ సినిమా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను దక్కించుకోవచ్చునని హాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ పాడారు. ఇప్పటికే ఈ పాటకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆస్కార్ తర్వాత ఆస్కార్ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘నాటు నాటు’ పాటకు దక్కింది. క్రిటిక్ ఛాయిస్ అవార్డు అందుకుంది.
లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊహకందని ఊచకోత కోసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి సంవత్సరం గడుస్తున్నా సరే..ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం, ఒక పక్క ఆస్కార్ ప్రమోషన్స్ లో టీం బిజీగా ఉండగా మరో పక్క జపాన్ లో సినిమా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూనే ఉంది. అమెరికా లో కూడా ఆ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది.
అయితే ఆస్కార్స్ సమయం లో తెలుగు రాష్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆ రోజు మొత్తం మీద నైజాంలో 80 థియేటర్స్, ఆంధ్రలో 100 థియేటర్స్ లో సీడెడ్ లో 30 వరకు థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి 20 లక్షల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ జరిగాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు గనక దక్కితే ఆ టైంలో థియేటర్స్ లో సినిమా రచ్చ చేసి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకొనే అవకాశం ఉంది.
బ్రిటీష్ టైమ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. ఇద్దరు పోరాట యోధులు కలిసి బ్రిటీషర్లపై సాగించిన పోరాటాన్ని దర్శకుడు రాజమౌళి ఎమోషనల్‌గా ఈ సినిమాలో ఆవిష్కరించారు.