RRR పై విదేశీయుల అభిమానం మామూలుగా లేదుగా..? సినిమా చూసి ఇలా కూడా చేస్తారా..?

RRR పై విదేశీయుల అభిమానం మామూలుగా లేదుగా..? సినిమా చూసి ఇలా కూడా చేస్తారా..?

by Anudeep

Ads

దర్శకధీరుడు జక్కన చెక్కిన మరో అద్భుత చిత్రమే ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా..  అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా అలరించారు. అజయ్ దేవగణ్, శ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు.

Video Advertisement

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఓవైపు బాలీవుడ్ సెలబ్రెటీస్ సైతం ఆర్ఆర్ఆర్ విజయాన్ని చూసి ఓర్వలేక తమ ఆక్రోశాన్ని బాహాటంగానే వెళ్లగక్కారు.

సినిమాలో ఇద్దరు హీరోలకి సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పాటలు సినిమా విడుదల అవ్వకముందే విడుదల అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా కొమరం భీముడో పాట అయితే విడుదల అయిన వెంటనే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది.

rrr movie review

అటు థియేటర్లు, ఇటు ఓటీటీలలో ప్లాట్‌ఫామ్ ఏదైనా ఆర్ఆర్ఆర్ కు తిరుగు లేకుండా పోయింది. అంతేకాదు విదేశాల్లో సైతం ఆర్ఆర్ఆర్ ఫాన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నారు.ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన ఓ బ్రిటీష్ అభిమాని ఇలా ట్వీట్ చేసాడు. “ఎట్టకేలకు నేను ఆర్ఆర్ఆర్ చూశాను. నేను నా బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నాను. అలాగే నేను నా పిల్లల పేర్లను రామ్ మరియు భీమ్ గా మారుస్తున్నాను.” అంటూ ట్వీట్ చేసాడు.

rrr team reply to a foreign netizen

దీనికి ఆర్ఆర్ఆర్ టీం స్పందిస్తూ, ” హహాహా . స్వీట్!” అంటూ కామెంట్ చేసింది. ఇది చూసిన మన నెటిజన్లు విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ వస్తుంది అంటూ మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు. కొందరేమో ‘సో స్వీట్, ఇంట్రెస్టింగ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న సినిమాలో దేశ భక్తిని కూడా జోడించడంతో ప్రపంచ దేశాలన్నింటికీ మన దేశం యొక్క గొప్పదనం తెలియ చెప్పడని నెటిజన్లు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


End of Article

You may also like