ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించేది కూడా ఈ కార్తీకమాసమే. కార్తీక మాసంలో నిష్టతో ఉంటూ మహా శివుడికి పూజలు చేస్తే ఆ శివుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. దానికి అనుగుణంగానే కార్తీక మాసం మొత్తం శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. మహిళలైతే తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానాలు ఆచరించి ఇంటి వద్ద పూజలు చేసి తులసి చెట్టుకి దీపారాధన చేస్తారు.

Video Advertisement

అనంతరం దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయం లేదా శివాలయానికి వెళ్లి అభిషేకాలు నిర్వహిస్తారు. శివుడిని అభిషేక ప్రియుడుగా కూడా కొలుస్తారు. కార్తీక మాసంలో శివాలయంలో అభిషేకం చేయించుకుంటే ఎటువంటి దోషాలున్న తొలగిపోతాయని లేదా అదృష్టం వరుస్తుంది అని నమ్ముతారు. కార్తిక మాసంలో వనభోజనాలు చేయడం ఎంతో పుణ్యం గా భావిస్తారు.

why turmeric and sindhoor not used in lord shiva rituals..

అయితే ఈ సంవత్సరం కార్తీకమాసం అక్టోబర్ 29 నుండి మొదలై నవంబర్ 27 తో ముగుస్తుంది. ఈనెల రోజులపాటు హిందువులుగాని భక్తులు గాని ఎంతో నియమనిష్టలతో ఉంటారు. అయితే చాలామందికి కార్తీక మాసంలో ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో అనేది తెలియదు. అలాంటి వారి కోసమే కార్తీకమాసంలో చెయ్యకూడని పనులను వివరిస్తున్నాం.కార్తీక మాసంలో మద్యం కానీ మాంసాహారం కానీ ముట్టకూడదు.

junk food 3

కేవలం శాఖాహార భోజనం మాత్రమే తినాలి అది కూడా మౌనంగా తినాలి. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటి పదార్థాలను కూడా ముట్టుకోకూడదు. పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు కూడా ముట్టుకోకూడదని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం నాడు కొబ్బరి, ఉసిరి వంటి పదార్థాలు జోలికి వెళ్ళకూడదు. స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకోకూడదు. అలాగే దీపం దానం ఇచ్చేటప్పుడు ఒక దీపాన్ని ఇవ్వకూడదు.

Also Read:వాహనంని “నిమ్మకాయ” తొక్కించడం వెనక అసలు కథ ఇదే.! తెలియక ఇన్ని రోజులు గుడ్డిగా పాటిస్తున్నామా.?