10 నెలల తర్వాత ఓటిటిలోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న ఈ రియల్ స్టోరీ చూసారా.? ఇందులో ఏముంది.?

10 నెలల తర్వాత ఓటిటిలోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న ఈ రియల్ స్టోరీ చూసారా.? ఇందులో ఏముంది.?

by kavitha

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా రోజులకి టీవీలలో వచ్చేవి. ప్లాప్ అయిన సినిమాలు అయితే ఇంక వాటి సంగతి మర్చిపోవటమే. అయితే ఓటీటీ ల పుణ్యమా అని ఇప్పుడు చిన్న సినిమాలని కూడా ఓసారి చూద్దాంలే అని చూసేవాళ్ళు ఉన్నారు. కంటెంట్ బాగుంటే సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయినా ఓటీటీ లో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఒకటి ఓటిటిలోకి వచ్చేసింది.

Video Advertisement

సాచి అనే సినిమా 2023 మార్చి 3న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే అందులో పేరున్న నటులు ఎవరూ లేకపోవడం, చిన్న సినిమా కావటంతో దానిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే మహిళా సాధికారత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా కంటెంట్ పరంగా చాలా బాగుంటుంది. స్టోరీ పరంగా మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ మరీ సాగదీసినట్లుగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అయింది అనిపిస్తుంది.

ఇంతకీ ఈ కథ ఏమిటంటే బార్బర్ షాప్ నడిపే ఒక వ్యక్తికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు వారి సంసారం సజావుగా సాగుతుంది అనుకునే సమయంలో తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. అప్పుడు సంసారం అతలాకుతలం అయిపోతున్న సమయంలో పెద్ద కూతురు ఇంటి బాధ్యతని తీసుకొని తండ్రి బార్బర్ షాప్ ని రన్ చేస్తుంది.

ఆ షాపుపై వచ్చే సంపాదనతోనే ఇంటిని నడిపిస్తూ చెల్లెళ్లు ఇద్దరినీ చదివిస్తుంది.ఈ క్రమంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటుంది. తనకి ఎదురైన సమస్యలు వాటిని ఆమె ఎదుర్కొన్న విధానం సాచి సినిమాలో చాలా బాగా చూపిస్తారు. అయితే 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా భారతదేశంలో తప్పితే మిగతా దేశాలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది త్వరలో మనదేశంలోకి కూడా ప్రేక్షకుల ముందుకి రావచ్చు.


You may also like

Leave a Comment