“పెళ్లయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు..!” అని ఉపాసన అడిగితే…సద్గురు ఏమన్నారంటే.?

“పెళ్లయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు..!” అని ఉపాసన అడిగితే…సద్గురు ఏమన్నారంటే.?

by Anudeep

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 2012, జూన్ 14న అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ మరియు భారతీయ వ్యాపారవేత్త అయిన ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన 2, 3 సంవత్సరాల తర్వాత నుంచి ఎక్కడికి వెళ్లినా వారిని మీడియా పిల్లల అడిగే వారు దానికి సమాధానం ఇవ్వడానికి వారు పెద్దగా ఆసక్తి చూపలేదు.

Video Advertisement

అయితే తాజాగా మెగా కోడలు మాతృత్వంపై తన ప్రశ్నలను సద్గురు ముందు ఉంచారు. సద్గురుతో ఉపాసన ఆర్ఆర్ఆర్ (RRR) గురించి అడిగింది. RRR అంటే రాజమౌళి సినిమా గురించి అయితే కాదు. రిలేషన్ (R) రీ ప్రొడ్యూస్ (R) రోల్ ఇన్ లైఫ్ (R) అంటూ వీటి గురించి జనాలు నన్ను ఎందుకు అడుగుతుంటారు అని ఉపాసన సద్గురుని అడిగారు. దీనికి సద్గురు అద్భుతంగా సమాధానం ఇచ్చారు.

మాకు పెళ్లై పదేళ్లు అవుతున్నాయి.. నా లైఫ్ నాకు ఎంతో నచ్చింది.. బాగుంది.. ఐ లవ్ మై లైఫ్.. కానీ జనాలు మాత్రం మా విషయంలో RRR గురించి అడుగుతుంటారు ఎందుకు?..రిలేషన్‌షిప్ (R), ఎబిలిటీ టు రీ ప్రొడ్యూస్ (R), రోల్ ఇన్ లైఫ్ (R) అంటూ జనాలు ఎప్పుడూ ఎందుకు నా గురించి ఆలోచిస్తుంటారు అని సద్గురుని అడిగారు. సద్గురు రీ ప్రొడ్యూస్ గురించి అద్భుతంగా వివరించారు. పిల్లల్ని కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డు ఇస్తాను.. పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ తరం వాళ్లు అలా ఉంటే.. నేను అందరికీ అవార్డు ఇస్తాను. ఒక వేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే పిల్లల్ని కనమని నేను చెప్పేవాడిని.

ఎందుకంటే అవి అంతరించి పోతున్నాయి. కానీ మన అంతరించడం లేదు.  ఇప్పటికే ఈ భూమ్మీద మనం ఎక్కువ సంఖ్యలో ఉన్నాం.. పని ఉంటే పిల్లల్ని కనే ఆలోచనలుండవు. పని లేని వాళ్లందరికి ఆ హార్మోన్లు ఆగనివ్వవు.. పిల్లల్ని కంటూ ఉంటారు. కాబట్టి పిల్లన్ని కనకుండా ఉండటమే మనం చేసే గొప్ప మేలు అన్నట్టుగా ఉపాసన అడిగిన ప్రశ్నలకు సద్గురు సమాధానం ఇచ్చారు.
అయితే సద్గురు ఇలా చెప్పడంతో మెగా కోడలు ఉపాసన ఇలా అన్నారు. మీరు ఇలా చెప్పారు కదా? మీకు వెంటనే మా అమ్మ, అత్తగారి నుంచి ఫోన్లు వస్తాయ్ అన్నారు. అలాంటి అత్తలు, అమ్మల నుంచి నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయ్ అని సద్గురు సరదాగా నవ్వేశారు. ఉపాసన సద్గురు మధ్య జరిగిన సంభాషణ కింద వీడియోలో ఉంది.

watch video :


You may also like

Leave a Comment