మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయి ధరమ్ తేజ్. అతి తక్కువ సమయంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.. గతేడాది బైక్ యాక్సిడెంట్ జరిగి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న మేగా మేనల్లుడు ఇప్పుడు పూర్తిగా కోలుకుని కెమెరా ముందుకు వస్తున్నాడు.
Video Advertisement
ఇక ప్రస్తుతం తాజా చిత్రం విరూపాక్ష తో మన ముందుకు రాబోతున్నాడు. . ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న తేజ్ తన ఆక్సిడెంట్ కి సంబంధించిన వివరాలు, తనని కాపాడిన వ్యక్తి గురించి పలు విషయాలను వెల్లడించారు. గతేడాది సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు సాయి ధరమ్ తేజ్. చాలా రోజులు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోనే ఉన్నాడు తేజ్. చాలా రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి వచ్చాడు తేజ్.
ఒక రకం గా చెప్పాలంటే హెల్మెట్ ఒకటే అతడి ప్రాణాలను నిలిపింది. అయితే ప్రమాదం ఎఫెక్ట్ మాత్రం తేజ్‌పై చాలా రోజుల పాటు ఉంది. మాటలు మాట్లేందుకు కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఆల్ సెట్. మళ్లీ సినిమాలు మొదలెట్టేశాడు. వరుస ప్రాజెక్టులతో బిజీ గా మారాడు సాయి ధరమ్ తేజ్.
ఇక తాజాగా యాక్సిడెంట్ జరిగిన రోజు తనను కాపాడిన వ్యక్తి గురించి కొన్ని వివరాలు చెప్పాడు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ జరిగిన రోజు సాయి ధరమ్ తేజ్ ని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్ధుల్. కోలుకున్నాక అతడిని కలిసినట్లు సాయి తేజ్ చెప్పాడు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..”డబ్బు ఇచ్చి.. ప్రాణం నిలిపిన అతడికి థ్యాంక్స్ చెప్పి పంపలేను. అందుకే నా నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా ఫోన్ చేయమని చెప్పాను. మానవత్వానికి డబ్బుతో ముడి కట్టలేను. అతడికి సాయం కావాలంటే మాత్రం ఎక్కడివరకు అయినా వెళ్తాను.” అని తేజ్ వెల్లడించారు.
ఇక ఈ ఇంటర్వ్యూ లో సాయి తేజ్ మాట్లాడుతూ.. ఆక్సిడెంట్ జరిగిన రోజు తాను మద్యం సేవించలేదని, తనకు ఆ అలవాటు లేదని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఆ రోజు జరిగిన ఘటన పై ఎన్నో అవాస్తవాలు ప్రచారం అయ్యాయని ఆయన తెలిపారు.