Ads
పరిశ్రమలన్నింటిలోను సినీ పరిశ్రమ చాలా సున్నితమైనది. సినిమా కళాకారుల మనస్తత్వం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. తమిళ్ పరిశ్రమతో పోలిస్తే తెలుగు పరిశ్రమలో నటులు అంత తొందరగా ఎటువంటి వివాదాల జోలికి పోరు.
Video Advertisement
కొన్ని సార్లు వాళ్ళు వివాదాల జోలికి పోకపోయినా, కొన్ని వివాదాలు అనుకోని పరిస్ధితుల్లో వాళ్ళ తలకి చుట్టుకుంటాయి. ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అలాంటి వివాదంలోనే చిక్కుకోవడం జరిగింది.
ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి సమాధానం చెబుతూ చేసిన వాఖ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఆమె మాటలని అనేక సంఘాలు వ్యతిరేకించడం జరిగింది. అంతే కాక ఆమె సినిమాలని బహిష్కరిస్తాం అంటూ, ఇటీవల విడుదల అయిన ఆమె సినిమా ‘విరాటపర్వం’ చూడొద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమె మాట్లాడిన మాటల్లో తప్పు, ఒప్పులు ఏంటి అనేది పూర్తిగా అర్ధం చేసుకోకుండానే ఆమె మీద దుష్ప్రచారం చేస్తున్నారని, ఆమె మాట్లాడిన మాటల్లో తప్పు లేదని మరికొంత మంది ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. అసలు ఆమె ఏం అన్నారు అనేది కింద వీడియోలో చూడండి.
watch video:
అయితే సాయి పల్లవి మాటలకు, ఆమె నటించిన సినిమా లకి సంబంధం ఏంటి ?? అని, కేవలం ఆమె వ్యాఖ్యలని దృష్టి లో పెట్టుకొని , వేల మంది కార్మికులు కష్టించి పని చేసి, తీసిన సినిమా మీద దుష్ప్రచారం చేయడం తగదని, సినిమాను వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూడాలని అంటూ సినిమా అభిమానులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాలన్నీ తొందర్లోనే సర్దుమణుగుతాయని, ఇకపై ఎటువంటి వివాదాలు సాయి పల్లవి కెరీర్ ని దెబ్బ తీయకూడదు అని ఆమె అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
End of Article