Ads
ఫిదా చిత్రంతో అందరి మనసులు దోచేసింది సాయిపల్లవి. తనకంటూ నటన పరంగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ లేడీ పవర్ స్టార్ గా చిత్రాల్లో దూసుకుపోతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవి క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు.
Video Advertisement
తన సహజ నటనతో అందర్నీ ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. మొదటి చిత్రమైనా ఫిదా తోనే ప్రేక్షకులను ఫిదా చేసేసుకుంది. తన అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకుని టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది సాయిపల్లవి. ఈమధ్య విడుదలైన విరాట పర్వం చిత్రం సాయిపల్లవి కెరీర్లో ఒక డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ చిత్రంతో సాయిపల్లవి క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి తనకి జరిగిన క్రేజీ ఇన్సిడెంట్ గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే మై విలేజ్ షో లో గంగవ్వ అడిగిన ప్రశ్నకు చిన్నతనంలో తను చేసిన ఒక పనికి తల్లిదండ్రులతో తన్నులు తిన్నాను అని జరిగిన ఒక సంఘటనను చెప్పుకొచ్చింది. గంగవ్వ విరాటపర్వం చిత్రంలో “ప్రేమ లేఖ నిజంగానే రాశావా?” అని క్వశ్చన్ చేయగా.. “ఈ చిత్రంలో డైరెక్టర్ చెప్పిన విధంగా రాసినట్లు నటించాను. కానీ నిజజీవితంలో ఏడో తరగతి చదువుతున్న టైమ్ లో ఒక అబ్బాయికి ఒక ప్రేమ లేఖ రాశాను. అది కాస్తా మా తల్లిదండ్రులు కంటిలో పడడంతో నాకు బాగా తన్నులు పడ్డాయి” అంటూ విలేజ్ షో లో తన ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంది సాయిపల్లవి. ఈ వీడియో కొత్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Watch this video:
End of Article