సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

Video Advertisement

 

 

ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. అయితే ఈ చిత్రం లో కీలక పాత్రల కోసం పలువురు స్టార్ నటులను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పుష్ఫ 2లో అయితే ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనుండగా విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక కీలకపాత్ర కోసం రామ్ చరణ్ ని సుకుమార్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాలేదు.

 

saipallavi in pushpa 2..??
అలాగే రష్మిక ని హీరోయిన్ గా తప్పించి సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన అవి నిజం కాదని తెలుస్తోంది. వేరే పాత్ర కోసం సాయి పల్లవిని పుష్ప టీం సంప్రదించిందని సమాచారం. సుకుమార్ ఈ చిత్రం కోసం ఒక బలమైన మరియు గుర్తుండిపోయే గిరిజన అమ్మాయి పాత్రను రాశాడంట. పూర్తి డీగ్లామర్ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించగలదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఇందులో సాయి పల్లవి పాత్ర 20 నిముషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కేథరీన్ ట్రెసా, మనోజ్ బాజ్ పాయ్ ని కూడా ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు సమాచారం.

 

saipallavi in pushpa 2..??
ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు సుకుమార్. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీతో పాటు కలిపి మొత్తం పది భాషాల్లో పుష్ప‌ 2 సినిమా రాబోతుంది. మరోవైపు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ రిలీజ్ పై లేటెస్ట్ గా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పుష్ప 2 సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.