Ads
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అసలు ఇది ఐపీఎల్ మొదలయ్యే టైం కాకపోయినా కూడా, ఈ సారి ఉన్న పరిస్థితుల కారణంగా లేట్ గా అయినా సరే ఐపీఎల్ మొదలైంది. అంతే కాకుండా ఈ సారి ఐపీఎల్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, వాటన్నిటినీ దాటుకొని ఐపీఎల్ టెలికాస్ట్ చేసే ఛానల్స్ కి టాప్ టిఆర్పీ ఇస్తూ దూసుకుపోతోంది.
Video Advertisement
ప్రతి టీం ని ముందుకు నడిపించే వాళ్ళే కెప్టెన్స్. ఆడే అందరి ప్లేయర్స్ మీద బాధ్యతలు కచ్చితంగా ఉంటాయి. కానీ కెప్టెన్స్ కి మాత్రం, ఆడటంతో పాటు కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి. ఐపీఎల్ 2020 లో కెప్టెన్స్ శాలరీస్ ఎంతో ఇప్పుడు చూద్దాం.
#1 శ్రేయస్ అయ్యర్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న శ్రేయాస్ అయ్యర్ కి చెల్లిస్తున్న మొత్తం 7 కోట్లు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ని ఎంచుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన కెప్టెన్సీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు.
#2 దినేష్ కార్తీక్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి కెప్టెన్సీ వహిస్తున్న దినేష్ కార్తిక్ కి చెల్లించే మొత్తం 7.4 కోట్లు. దినేష్ కార్తీక్ 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడారు. 2015 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున, అలాగే 2016లో గుజరాత్ లయన్స్ తరపున ఆడారు. 2018 నుండి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నారు దినేష్ కార్తీక్.
#3 కేఎల్ రాహుల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న కేఎల్ రాహుల్ కి చెల్లించే మొత్తం 11 కోట్లు. కేఎల్ రాహుల్ 2018 నుండి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్నారు.
#4 డేవిడ్ వార్నర్
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి కెప్టెన్సీ వహిస్తున్న డేవిడ్ వార్నర్ కి చెల్లిస్తున్న మొత్తం 12 కోట్లు. డేవిడ్ వార్నర్ 2019 లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2014 నుండి హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తరపున ఆడుతున్నారు.
#5 స్టీవ్ స్మిత్
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న స్టీవ్ స్మిత్ కి చెల్లించే మొత్తం 12 కోట్లు. బ్యాన్ కారణంగా మధ్యలో ఒక ఏడాది పాటు స్టీవ్ స్మిత్ క్రికెట్ కి దూరంగా ఉన్నారు. మళ్లీ 2019లో తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టారు.
#6 మహేంద్ర సింగ్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెల్లించే మొత్తం 15 కోట్లు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇంకా ఎనిమిది సార్లు ఐపీఎల్ ఫైనల్స్ లో పాల్గొంది. ఐపీఎల్ లో మోస్ట్ కన్సిస్టెంట్ కెప్టెన్ అనే పేరును సంపాదించారు మహేంద్ర సింగ్ ధోని.
#7 రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్సీ వహిస్తోన్న రోహిత్ శర్మకి చెల్లించే మొత్తం 15 కోట్లు. ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అలా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనే పేరును సంపాదించారు రోహిత్ శర్మ.
#8 విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్సీ వహిస్తున్న విరాట్ కోహ్లీకి చెల్లించే మొత్తం 17 కోట్లు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కూడా ఒకటే జట్టుని రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్ గా విరాట్ కోహ్లీ మరింత గుర్తింపు సంపాదించారు.
End of Article