Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అసలు ఇది ఐపీఎల్ మొదలయ్యే టైం కాకపోయినా కూడా, ఈ సారి ఉన్న పరిస్థితుల కారణంగా లేట్ గా అయినా సరే ఐపీఎల్ మొదలైంది. అంతే కాకుండా ఈ సారి ఐపీఎల్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, వాటన్నిటినీ దాటుకొని ఐపీఎల్ టెలికాస్ట్ చేసే ఛానల్స్ కి టాప్ టిఆర్పీ ఇస్తూ దూసుకుపోతోంది.
Video Advertisement
టీం కి ప్లేయర్స్ ఎంత ముఖ్యమో వాళ్లని ట్రైన్ చేయడానికి కోచ్ లు కూడా అంతే ముఖ్యం. ప్లేయర్స్ తో పాటు కోచ్ లు కూడా చాలా కష్టపడతారు. అందుకే వాళ్ల కష్టానికి తగ్గట్టే, వాళ్ల శాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఐపీఎల్ 2020 కాంట్రాక్ట్ ప్రకారం కోచ్ ల శాలరీ ఎంతో ఇప్పుడు చూద్దాం.
#1 సైమన్ కటిచ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హెడ్ కోచ్ అయిన సైమన్ కటిచ్ శాలరీ 4.2 కోట్లు.
#2 అనిల్ కుంబ్లే
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు హెడ్ కోచ్ అయిన అనిల్ కుంబ్లే శాలరీ 4 కోట్లు.
#3 బ్రెండన్ మెక్ కల్లమ్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు హెడ్ కోచ్ అయిన బ్రెండన్ మెక్ కల్లమ్ శాలరీ 3.4 కోట్లు.
#4 స్టీఫెన్ ఫ్లెమింగ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ శాలరీ 3.4 కోట్లు.
#5 ఆండ్రూ మెక్ డోనాల్డ్
రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ అయిన ఆండ్రూ మెక్ డోనాల్డ్ శాలరీ 3.4 కోట్లు.
#6 రికీ పాంటింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ శాలరీ 3.4 కోట్లు.
#7 ట్రెవర్ బేలిస్
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు హెడ్ కోచ్ అయిన ట్రెవర్ బేలిస్ 2.25 కోట్లు.
#8 మహేల జయవర్ధనే
ముంబై ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ అయిన మహేల జయవర్ధనే శాలరీ 2.25 కోట్లు.
End of Article