“ముఖేష్ అంబానీ” దగ్గర పని చేసే ఈ 6 వ్యక్తుల జీతాలు ఎంతో తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!

“ముఖేష్ అంబానీ” దగ్గర పని చేసే ఈ 6 వ్యక్తుల జీతాలు ఎంతో తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!

by Harika

Ads

ప్రపంచ కుబేరుల స్థానం లో చోటు దక్కించుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు భారత్ లోనే ఉండరు. లక్షల కోట్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సామ్రాజ్యానికి అధిపతి.. ఆయన వ్యాపారాలు దేశంలోని ప్రతి మూల నుంచి విదేశాలకు విస్తరించాయి. ఇక ఆయన జీవనవిధానం, ఆయన లగ్జరీ లైఫ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు.

Video Advertisement

 

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లల్లో అంబానీ ఇల్లు ఆంటిలియా కూడా ఒకటి. ఇక్కడ సుమారు 600 మంది వరకు పనివాళ్ళు ఉన్నారు. ఇక ఆ ఇంట్లో పనిచేసేవారిని అంబానీ సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. వారికీ నెల జీతం తో పాటు ఇన్సూరెన్స్, పిల్లలకు ట్యూషన్ ఫీజులను కూడా అందిస్తారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముకేష్ అంబానీ ఉద్యోగులలో కొంతమంది పిల్లలు అమెరికాలో చదువుతున్నారు.

know the salaries of ambani's workers..!!

ఆంటిలియాలో టెండర్లను తీసుకునే ఉద్యోగుల నియామకం కోసం ప్లేస్‌మెంట్ ఏజెన్సీ పనిచేస్తుంది. అనేక స్థాయి ప్రమాణాలను దాటిన తరువాత, ముకేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఇంటి సిబ్బంది కావడానికి అవకాశం లభిస్తుంది. అయితే అంబానీ ఇంట్లో పనివారికి ఇచ్చే జీతాలెంతో ఇప్పుడు చూద్దాం..

#1 చెఫ్

ముకేశ్ అంబానీ చాలా సాధారణమైన ఆహారం తీసుకుంటారు. ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారట. వంటకాల్లో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయిస్తారట. అలాగే ముకేశ్ అంబానీకి థాయ్ వంటకాలంటే చాలా ఇష్టం.

know the salaries of ambani's workers..!!

అయితే అంబానీ కి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసే చెఫ్ నెలకు రూ.2 లక్షలకుపైగా వేతనం తీసుకుంటున్నాడట. ఈ మేరకు మీడియా లో పలు కథనాలు వచ్చాయి.

#2 డ్రైవర్

పెద్ద పెద్ద ప్రముఖుల ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లను ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు. అంబానీ ఇంట్లో డ్రైవర్ కూడా ఇలాగే వెళ్లారు. ఇక ఆయనకు కూడా ఐదేళ్ల కిందట నెలకు రూ.2 లక్షలు చెల్లించేవారట అంబానీ. ఇప్పుడు అది ఇంకా చాలా ఎక్కువే ఉండొచ్చు.

know the salaries of ambani's workers..!!

ప్రముఖులు, దిగ్గజాల దగ్గర పనిచేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో సహా అన్ని నైపుణ్యాలను ఆ కంపెనీలు ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఇక లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా వాడాలి.. అని కూడా శిక్షణ ఇస్తుంటాయి. ఎలాంటి రోడ్లపై అయినా, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఆ వాహనాన్ని నడిపేలా వీరు తర్ఫీదు పొందుతారు.

#3 మేకప్ ఆర్టిస్ట్

ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ వయసులోనూ అందంగా ఉండేలా చూసుకుంటారు. దీని వెనుక మేకప్ ఆర్టిస్ట్ ప్రతిభ ఉంటుంది. ఈమె మేకప్ ఆర్టిస్ట్ బాలీవుడ్‌లో ఎందరో సెలబ్రిటీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసే మిక్కీ కాంట్రాక్టర్.

know the salaries of ambani's workers..!!

నీతా అంబానీ కూతురు, కోడళ్లకు కూడా ఈయన సేవలు అందిస్తారట. ఇక ఈయన రోజుకు ఒక్కొక్కరి దగ్గర రూ.75 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తారట.

#4 సెక్యూరిటీ గార్డ్స్

అంబానీ ఇంటి వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డ్స్ నెలకు 55 వేల రూపాయల వరకు జీతం అందుకుంటున్నారు.

know the salaries of ambani's workers..!!

#5 ముఖేష్ అంబానీ అసిస్టెంట్స్

ముఖేష్ అంబానీ కి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఐఐఎం బెంగుళూరు నుంచి పట్టా అందుకున్న ఆ ఇద్దరు నెలకు 25 లక్షల వరకు జీతం తీసుకుంటున్నారు.

know the salaries of ambani's workers..!!

#6 సీఆర్పిఎఫ్ కమాండోస్

ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యం లో అంబానీ ఫ్యామిలీ కి 28 సీఆర్పిఎఫ్ కమాండోస్
భద్రత కల్పించింది ప్రభుత్వం. వీరికి నెలకు 15 లక్షలు చెల్లిస్తారు అంబానీ.

know the salaries of ambani's workers..!!


End of Article

You may also like