ఐపీఎల్ 2020 లో ఈ “అంపైర్” ల శాలరీలు ఎంతో తెలుసా.? వారికి ఎవరు డబ్బు చెల్లిస్తారు.?

ఐపీఎల్ 2020 లో ఈ “అంపైర్” ల శాలరీలు ఎంతో తెలుసా.? వారికి ఎవరు డబ్బు చెల్లిస్తారు.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 ముగిసే తేదీ దగ్గరికి వస్తోంది. అసలు ఇప్పుడు పరిస్థితులు బాలేదు. అయినా సరే క్రికెట్ అభిమానులను నిరాశ పరచకుండా, తగిన జాగ్రత్తలతో, మ్యాచ్ చూడటానికి స్టేడియం కి వచ్చే వీలు లేకుండా, కరోనా దృష్ట్యా ఇంట్లోనే క్రికెట్ ని ఎంజాయ్ చేసేలా మ్యాచ్ లను నిర్వహించారు. ఈ విషయం డైరెక్ట్ గా స్టేడియం కి వెళ్లి మ్యాచ్ చూసే అలవాటున్న అభిమానులందరికీ ముందు కొంచెం నిరాశ కలిగించింది.

Video Advertisement

కానీ తర్వాత అవన్నీ మర్చిపోయి అందరూ ఆసక్తిగా క్రికెట్ చూస్తున్నారు. అందుకే ఐపీఎల్ ప్రసారం అయ్యే ఛానల్స్ అన్నీ టాప్ టీఆర్పీ లతో దూసుకుపోతున్నాయి. ఒక మ్యాచ్ కి ప్లేయర్స్, కోచ్, ఎంత ముఖ్యమో అంపైర్స్ కూడా అంతే ముఖ్యం. వాళ్లు కూడా చాలా కష్టపడతారు. అందుకే కష్టానికి తగ్గ శాలరీ తీసుకుంటారు. ఐపీఎల్ 2020 లో పాల్గొన్న అంపైర్ల శాలరీ ఎంతో ఇప్పుడు చూద్దాం.

ఇంకొక విషయం ఏంటంటే ప్లేయర్స్ లాగానే అంపైర్లకి కూడా మ్యాచ్ లో పాల్గొనే ముందు పరీక్ష చేయించుకోవడం, క్వారంటైన్ లో ఉండటం జరుగుతాయి. ఐపీఎల్ 2020 లో పాల్గొన్న ఇండియన్ అంపైర్లు అనిల్ చౌదరి, సి. షంషుద్దీన్, వీరేందర్ శర్మ, కె.ఎన్. అనంతపద్మనాభన్, నితిన్ మీనన్, ఎస్. రవి, వినీత్ కులకర్ణి, యశ్వంత్ బార్డే, ఉల్హాస్ గాంధే, అనిల్ దండేకర్, కె. శ్రీనివాసన్, పశ్చిమ్ పాఠక్.

ఫారిన్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్), పాల్ రీఫెల్ (ఆస్ట్రేలియా), క్రిస్టోఫర్ గఫానీ (న్యూజిలాండ్). ఈ సంవత్సరం ఐపీఎల్ అంపైర్లని పేటీఎం స్పాన్సర్ చేస్తున్నారు. టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్లకి 7,33,000 రూపాయలు ఇస్తారు. ఎలైట్ ప్యానెల్ అంపైర్లకి మ్యాచ్ కి 1,98,000 రూపాయలు, డెవలప్మెంట్ అంపైర్లకి ఒక మ్యాచ్ కి 59,000 రూపాయలు అందుతాయి.

అనిల్ చౌదరి, సి. షంషుద్దీన్, నితిన్ మీనన్, ఎస్. రవి, వినీత్ కులకర్ణి, ఉల్హాస్ గాంధే, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, పాల్ రీఫెల్, క్రిస్టోఫర్ గఫానీ ఎలైట్ అంపైర్ల జాబితాలోకి వస్తారు. వీరేందర్ శర్మ, కె. ఎన్. అనంతపద్మనాభన్, యశ్వంత్ బార్డే, అనిల్ దండేకర్, కె.శ్రీనివాసన్, పశ్చిమ్ పాఠక్ డెవలప్మెంట్ అంపైర్ల జాబితాలోకి వస్తారు. ఐసిసి ఎలైట్ ప్యానెల్‌ లో ఉన్న నాలుగవ అధికారి నితీష్ మీనన్.

అంతే కాకుండా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, పాల్ రీఫెల్, క్రిస్టోఫర్ గఫానీ కూడా ఈ జాబితాలోకి వస్తారు. దాదాపు 52,45,128 రూపాయలు సంపాదిస్తూ, అత్యధిక మొత్తం అందుకునే మ్యాచ్ అఫీషియల్ గా జవగళ్ శ్రీనాథ్ నిలిచారు.


End of Article

You may also like