బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోగా  కొనసాగుతున్నారు. ఇక సల్మాన్ బయటకు వస్తే చాలామంది ఫ్యాన్స్ ఆయనను కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

Video Advertisement

ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సల్మాన్ కు సెక్యూరిటీ కూడా చాలా కష్టమైన విషయమని చెప్పవచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే సల్మాన్ కి 25 సంవత్సరాలుగా షేరా అనే వ్యక్తి  బాడీగార్డ్ గా ఉంటున్నాడు. తాజాగా షేరా గురించిన ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏమిటో ఇపుడు చూద్దాం..
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, స్టార్ హీరో అయిన సల్మాన్ బయటికి వస్తే తమ అభిమాన స్టార్ తో సెల్ఫీలు  తీసుకోవడం కోసం, సల్మాన్ తో షేక్ హ్యాండ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ ఎక్కువగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ సెక్యూరిటీని బాగా టైట్ చేశారు.
ఇక సల్మాన్ కు సెక్యూరిటీ ఇవ్వాలంటే ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. గత ఇరవై ఐదు ఏళ్లుగా సల్మాన్ కి షేరా అనే వ్యక్తి బాడీగార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతను సల్మాన్ కి చాలా నమ్మకస్తుడు. షేరా హాలీవుడ్ హీరో విల్ స్మిత్, జస్టిన్ బీబర్, మైక్ టైసన్, జాకీ చాన్, మైఖేల్ జాక్సన్‌ల వంటి చాలా మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ముంబైకి వచ్చిన సమయంలో వారికి కూడా సెక్యూరిటీగా ఇచ్చేవారు. ఈ విషయలను బట్టి షేరా ఇచ్చే భద్రత, అతనికున్న పేరును  అర్థం చేసుకోవచ్చు. ఎంతో నమ్మకమైన బాడీగార్డ్ అయిన షేరాకు శాలరీ గురించి తెలిస్తే షాక్ అవుతారు. సల్మాన్ కు ఇంత నమ్మకమైన సెక్యూరిటీ ఇస్తున్న షేరాకు నెలకు దాదాపు 15 లక్షల వరకు జీతం ఇస్తారని తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా షేరా ‘టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్’ అనే సంస్థను స్టాపించాడు. ప్రస్తుతం దానికి సీఈఓగా ఉన్నాడు. షేరాకున్న ఆస్తుల విలువ సుమారు వంద కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బాడీగార్డ్ హీరోల రేంజ్ లో ఆస్తులను సంపాదించడం అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రస్తుతం అతను ఓ సెలబ్రిటీగా మారారు.

Also Read: PONNIYIN SELVAN-2 REVIEW : “మణిరత్నం” దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ – 2 హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!