దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. కళ్ళ ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. చివరిగా ఆయన చారిత్రక నేపథ్యం లో వచ్చిన రుద్రమదేవి చిత్రం చేసారు. అయితే ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చెయ్యలేదు గుణశేఖర్. అయితే చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తో ‘శాకుంతలం’ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Video Advertisement

 

 

ఈ చిత్రం పురాణాల ఆధారం గా రానుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్‌ మోహన్‌ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడులయ్యి అందర్నీ ఆకట్టుకుంటోంది.

samantha about shakunthalam movie..!!

అయితే సమంతకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. అలాగే సామ్ కూడా సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.. ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా అది విపరీతమైన రీచ్ తో వైరల్ అవుతాయి. అలా తాను మయోసైటిస్ బారిన పడినట్టు, చికిత్సా విధానం, తాను కోలుకుంటున్న తీరు అన్నీ సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే తాజాగా శాకుంతలం సినిమా గురించి సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

samantha about shakunthalam movie..!!

శాకుంతలం సినిమా షూటింగ్ సంగతులపై ఓ పోస్ట్ పెట్టింది సమంత. ఈ మూవీలో నటించేటప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ చాలా కష్టంగా అనిపించాయని సామ్ పేర్కొంది. నడుస్తున్నపుడు, మాట్లాడుతున్నప్పుడు, పరుగెత్తేటప్పుడు చివరకు ఏడ్చేటప్పుడు కూడా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఒకేలా పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. ఇది తన వల్ల కాలేదని పేర్కొన్న సామ్.. అలా కాకుండా ఈ సాషా (పెంపుడు కుక్క)ను తీసుకెళ్లాల్సింది అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఈ పోస్టులో పాటు శాకుంతలం భంగిమలో దిగిన ఓ ఫోటో షేర్ చేసింది సమంత. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.