టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి సమంత చాలా రోజుల నుంచి బయట కనిపించలేదు. ఆమెకు మయోసైటిస్ వ్యాధి వచ్చిందని చెప్పిన తర్వాత సమంత బయటకు రాలేదు. అయితే తాజాగా ఆమె నటించిన యశోద చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మరోవైపు సమంత ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. సామ్ తన ప్రాజెక్టుల నుంచి తప్పుకుందని, ఇక మీదట సినిమాలు చేయదని చాలా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై సమంత ఎప్పుడూ స్పందించలేదు.

Video Advertisement

 

అయితే తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించి తన గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది సామ్. ముంబై ఎయిర్ పోర్ట్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని చేతిలో బ్యాగ్ తో స్టైయిల్ గా నడుస్తూ కనిపించింది సమంత. చాలా రోజుల తర్వాత ఆమె బయట కనిపించడంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు వెంట పడ్డారు. అయితే ఎప్పుడు బయట కనిపించినా నవ్వుతూ ఫోటోగ్రాఫర్ లతో సరదాగా మాట్లాడే సమంత ఇప్పుడు కనీసం కెమెరాల వైపు కూడా చూడకుండా సైలెంట్ గా వెళ్లిపోవడం గమనార్హం. ఆమె మొఖం కూడా చాలా నీరసంగా కనిపిస్తోంది.

samantha appears at mumbai airport..!!

మయోసైటిస్ వల్ల సమంత చాలా బలహీనంగా మారిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అయింది సమంత. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో ‘సిటాడెల్’ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పింది సమంత. అయితే ఇటీవలే ఆమె ఆ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు కూడా వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి సామ్ ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. సమంత ముంబై ఎందుకొచ్చింది అనే దానిపై మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది సమంత.

samantha appears at mumbai airport..!!

ఇకపోతే.. గుణ శేఖర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శాకుంతలం సినిమా ఫిబ్రవర్‌ 17వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే సమంత ఇటీవలే ‘శాకుంతలం’ సినిమా డబ్బింగ్ ను ప్రారంభించాను అని ఓ పోస్ట్ పెట్టింది. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సామ్‌ శకుంతలగా నటిస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు.