టాప్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ ఎట్టకేలకి పబ్లిక్‌లోకి వచ్చింది. గత ఏడాది ‘యశోద’ మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధి నుంచి కోలుకుంటోంది. అయితే ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్న సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ కి బయటకి వచ్చింది. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సామ్ ఈ వ్యాధి కారణంగా ఆ మధ్య కాస్త స్లో అయ్యింది కానీ మళ్ళీ ఇదివరకు లాగే తిరిగి సోషల్ మీడియా లో యాక్టీవ్ గా మారింది.

Video Advertisement

 

 

నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది సామ్. అయితే తాజాగా సామ్ తన ఇన్ స్టా లో పోస్ట్ ఆసక్తి కరం గా మారింది. తన కొత్త బెస్ట్ ఫ్రెండ్ అంటూ సామ్ ఆ పోస్ట్ పెట్టింది. ఇంతకీ సామ్ న్యూఫ్రెండ్ ఎవరో తెలుసా ?.. గ్లాసెస్. మిరుమిట్లు గొలిపే వెలుగుల కాంతులలో చిరునవ్వులు చిందిస్తూ తన సెల్ఫీని షేర్ చేసింది. అందులో ఆమె కొత్త గ్లాసెస్ ధరించింది. గ్లాసెస్ నా కొత్త బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

 

samantha introduced her new best friend

ఇటీవల సామ్ శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో చేతిలో జపమాల.. గ్లాసెస్ ధరించి కనిపించింది. మునుపటి కంటే సామ్ లుక్స్..ఆహార్యం పూర్తిగా మారిపోయింది. నిత్యం జపమాల, కాళ్ళ జోడు, తెల్లటి దుస్తులు సామ్ ధరిస్తోంది. దీంతో ఆమె అందం తగ్గిందంటూ కామెంట్స్ చేశారు. తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల పట్ల గట్టిగానే కౌంటరిచ్చింది సామ్. ఇక ఇటీవలే జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. మన ఆలోచనలే మన బలం అంటూ రాసుకొచ్చింది. ఆటో ఇమ్యూనిటీ.. మనం తీసుకునే ఆహారం మాత్రమే మన బలం కాదు.. మన ఆలోచనలే మనకు అసలైన బలం అంటూ సామ్ షేర్ చేసిన వీడియోవైరల్ అయ్యింది.

samantha introduced her new best friend

మరో వైపు సామ్ నటించిన శాకుంతలం చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించారు. ఇదే కాకుండా.. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివనిర్వాణ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ సిరీస్ లోనూ సామ్ కనిపించనుంది. సమంతకి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన ఫ్యామిలీ‌మెన్-2 సిరీస్ దర్శకులే ఈ వెబ్‌సిరీస్‌కి దర్శకత్వం వహించబోతున్నారు.