‘సిటాడెల్’ ప్రాజెక్ట్ లో “సమంత”..?? రూమర్లకు చెక్..!!

‘సిటాడెల్’ ప్రాజెక్ట్ లో “సమంత”..?? రూమర్లకు చెక్..!!

by Anudeep

Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘యశోద’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. అయితే సామ్ గత కొన్నినెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకుముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితిపై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Video Advertisement

 

 

సమంత హెల్త్ బాలేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె సినిమాలకు షూటింగులకు దూరంగా ఉంది. దీంతో సమంత చేయాల్సిన సినిమాలకు బ్రేకులు పడ్డాయి. . ఫ్యామిలీ మ్యాన్‌-2 త‌ర్వాత బాలీవుడ్‌లో మ‌రో యాక్ష‌న్ వెబ్‌సిరీస్‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో స్ఫై యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది. అయితే తన అనారోగ్యం కారణంగా సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి.

samantha is not quitting citadel series project..??

అయితే ఈ వార్తలను సమంత సన్నిహితులు ఖండించారు. జనవరి మూడో వారం నుంచి ఆమె ఈ సిరీస్ కి సంబంధించిన షూట్ లో పాల్గొననున్నట్లు వారు వెల్లడించారు. సమంత ఆరోగ్యం గురించి ఇటువంటి వార్తలు వ్యాప్తి చెయ్యొద్దని వారు కోరారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన సమంత తొమ్మిది నెలలకి ఈ ప్రాజెక్ట్ సైన్ చేసింది. స్పై థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి “సిటాడెల్” అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతోంది.

samantha is not quitting citadel series project..??

యాక్షన్ సినిమాలను రూపొందించే ‘రూసో బ్రదర్స్’ తమ ‘ABGO ఫిలిమ్స్’ బ్యానేర్ పై ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ‘సిటాడెల్ ఇంటలిజెన్స్ రైవల్ ఏజెన్సీ’ పేరుతో యూనివర్స్ ని క్రియేట్ చేసి సిటాడెల్ ఫ్రాంచైజీని రూపొందిస్తున్నారు. ఇందులో మెయిన్ సిరీస్ లో అమెరికన్ నటుడు రిచర్డ్ మేడిన్, ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇండియన్ స్పై థ్రిల్లర్ షూటింగ్ జనవరిలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ చేసిన ట్వీట్ లో కూడా సామ్ ని మెన్షన్ చేయకపోవడం తో సమంత అభిమానులు ఆందోళన పడ్డారు.


End of Article

You may also like