టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘యశోద’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. అయితే సామ్ త కొన్నినెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకుముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితిపై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Video Advertisement

 

 

సమంత హెల్త్ బాలేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె సినిమాలకు షూటింగులకు దూరంగా ఉంది. దీంతో సమంత చేయాల్సిన సినిమాలకు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ క్రమంలో సమంత సినిమాలకు సంబంధించి కొత్త వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఫ్యామిలీ మ్యాన్‌-2 త‌ర్వాత బాలీవుడ్‌లో మ‌రో యాక్ష‌న్ వెబ్‌సిరీస్‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో స్ఫై యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది.

samantha is out from bollywood project..??

 

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన సమంత తొమ్మిది నెలలకి ఒక ప్రాజెక్ట్ సైన్ చేసింది. స్పై థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి “సిటాడెల్” అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతోంది. యాక్షన్ సినిమాలను రూపొందించే ‘రూసో బ్రదర్స్’ తమ ‘ABGO ఫిలిమ్స్’ బ్యానేర్ పై ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ‘సిటాడెల్ ఇంటలిజెన్స్ రైవల్ ఏజెన్సీ’ పేరుతో యూనివర్స్ ని క్రియేట్ చేసి సిటాడెల్ ఫ్రాంచైజీని రూపొందిస్తున్నారు. ఇందులో మెయిన్ సిరీస్ లో అమెరికన్ నటుడు రిచర్డ్ మేడిన్, ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.

samantha is out from bollywood project..??

ఇందులో ఇండియన్ స్పై థ్రిల్లర్ షూటింగ్ జనవరిలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి సామ్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సామ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితేఈ సిరీస్ కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ చేసిన ట్వీట్ లో కూడా సామ్ ని మెన్షన్ చేయకపోవడం తో సమంత అభిమానులు ఆందోళన పడుతున్నారు. సమంత నిజంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి సామ్ విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.