ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత.. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే సమంత తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా మీడియాలో హడావుడి ప్రారంభమైంది, ఆమె ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుందని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

Video Advertisement

 

అయితే తన యశోద చిత్ర ప్రమోషన్స్ లో ఆమె తాను ఇప్పట్లో చనిపోయే పరిస్థితి లేదని అది అంత ప్రాణాంతకం అయితే కాదని సమంత చెప్పుకొచ్చింది. కొద్ది రోజులుగా టాలీవుడ్ ఫిలింనగర్ వర్గాల్లో సమంత ఆరోగ్యం మళ్ళీ చెడిపోయిందని ఆమె మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె మేనేజర్ అది నిజం కాదని ఆమె బాగానే ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

samantha latest health update..!!

స‌మంత ఇప్ప‌టికే అమెరికాలో చికిత్స తీసుకుని వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఆ త‌ర‌వాత కేర‌ళ లోనూ స‌మంత ఆయుర్వేదం తో వైద్యం తీసుకుంది. కాగా ఇప్పుడు సమంత చికిత్స కోసం కొరియాకు వెళ్లింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో ఆమె మేనేజ‌ర్ ఈ వార్త‌ల‌పై స్పందించారు. సమంత ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నార‌ని ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నార‌ని ఎక్క‌డ‌కూ వెళ్ల‌లేద‌ని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యొద్దని ఆయన కోరారు.

samantha latest health update..!!

ప్రస్తుతానికి ఆమె అనారోగ్యం నుంచి కోలుకునే దారిలో ఉందని వీలైనంత త్వరలో కోలుకొని పలు సినిమాల్లో భాగమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని ఆమె హీరోయిన్గా నటిస్తున్న ఖుషి సినిమా యూనిట్ కు తెలియజేసిందని, డిసెంబర్ నుంచి షూటింగ్లో తాను పాల్గొంటానని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చని ఆమె ఖుషీ మేకర్స్ కు సందేశం పంపినట్లుగా తెలుస్తోంది.