Ads
చై సామ్ విడాకులు తీసుకున్న వార్త సోషల్ మీడియా ను హోరెత్తించింది. గత మూడు, నాలుగు రోజుల పాటు ఆమె విడాకులు తీసుకున్న తాలూకు వార్తలే సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. విడాకులు తీసుకున్న తరువాత.. సమంత సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసింది. తాను కలలు గన్న దానికోసం కష్టపడాలని, ఇలా నిద్రపోతూ ఉండకూడదని తన పోస్ట్ లో పేర్కొంది. విడాకుల తర్వాత కూడా సమంత సోషల్ మీడియాలో ఆక్టివ్ గానే ఉంటున్నారు. తనను తాను మోటివేట్ చేసుకునే విధంగా ఉన్న స్టేటస్ లను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
Video Advertisement
అంతే కాదు.. ఆచరణలో కూడా సమంత దూసుకొళ్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న యాడ్స్ లో నటించడానికి కూడా సిద్ధమైంది. ఇటీవలే ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న సమంత షూటింగ్ గ్యాప్ లో కంటతడి పెట్టుకున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల గురించి అనౌన్స్ చేసిన తరువాత నుంచి సమంత సోషల్ మీడియా అకౌంట్ లపై మరింత ఫోకస్ పెరిగినట్లు అయింది. ఆమె చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి..
విడాకుల తరువాత జరుగుతున్న పరిణామాలపై సమంత తన బాధను వ్యక్తం చేసింది. “ఈ సమాజం ఎప్పుడు మహిళనే ప్రశ్నిస్తుంది. మగవాళ్ళని ప్రశ్నించదు.. అలాంటి సమయాల్లో మనకి ప్రాధమికంగా నైతిక హక్కు లేనట్లే..” అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్ ను పంచుకుంది. విడాకుల ప్రకటన తర్వాత నుంచి సామ్ ను చాలా మంది తప్పు పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సమంత చాలా మానసిక వత్తిడికి గురి అవుతున్నారట. అందుకే ఆరోజు షూటింగ్ గ్యాప్ లో కూడా సమంత ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
End of Article