సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే సమంత ప్రస్తుతం చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో సమంత ఒక వార్తకి రిప్లై ఇస్తూ ట్వీట్ చేశారు. నాగ చైతన్య వేరే ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఒక ట్విట్టర్ పేజ్ ఇదంతా సమంత పిఆర్ టీం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని, దాంతో నాగ చైతన్య అభిమానులు అందరూ సమంత పిఆర్ టీంని కామెంట్ చేస్తున్నారు అని అర్థం వచ్చేలాగా రాశారు. ఈ విషయంపై సమంత స్పందించారు.

samantha reacts on naga chaitanya dating rumors

“ఒక అమ్మాయి మీద ఏదైనా వార్త వస్తే అది నిజం అంటారు. ఒక అబ్బాయి మీద ఏదైనా వార్త వస్తే మాత్రం అది ఎవరు కావాలని క్రియేట్ చేశారు అని అంటారు. కొంచెం ఆలోచించండి. ఈ విషయంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముందుకు వెళ్ళిపోయారు. మీ పని మీరు చూసుకోండి. మీరు కూడా ముందుకు వెళ్ళండి. మీ కుటుంబాల గురించి చూడండి. ముందుకు వెళ్ళండి” అంటూ రిప్లై ఇచ్చారు.

Also Read :