“సిటాడెల్‌” వెబ్ సిరీస్ కి “సమంత” ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

“సిటాడెల్‌” వెబ్ సిరీస్ కి “సమంత” ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

by kavitha

Ads

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత ఇటీవలే శాకుంతలం చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించింది. ప్రస్తుతం సమంత రాజ్‌ అండ్ డీకే రూపొందిస్తున్న ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణలో బిజీగా ఉంది.

Video Advertisement

ఈ సిరీస్‌లో పోలీస్‌ అధికారిగా సమంత నటిస్తోంది. ఆమె హీరోయిన్ గా ఇప్పటి వరకు బాలీవుడ్ లో నటించకపోయిన  ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్ తో అక్కడ కూడా పాపులర్ అయ్యింది. సిటాడెల్‌ సిరీస్ కోసం సమంత తీసుకునే  రెమ్యూనరేషన్ గురించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటో చూద్దాం..
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సిటాడెల్‌ సిరీస్ లో సమంత నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సిరీస్ యాక్షన్‌ సీన్స్ కోసం ఆమె చాలా కష్టపడుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ సమంత ఎంతగానో కష్టపడుతోంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే సమంత ఈ సిరీస్ కోసం రెమ్యూనరేషన్ ను కూడా భారీగానే తీసుకున్నట్లుగా టాక్.
సిటాడెల్‌ సిరీస్ కోసం సమంత 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. నిర్మాతలు 5 కోట్లతో పాటుగా ఇతర ఖర్చుల కోసం మరో కోటి రూపాయలు ఇస్తున్నారని తెలుస్తోంది. హీరో వరుణ్ దావన్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా సమంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి తగ్గట్లుగానే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత కష్టపడుతోంది.
ఇక సమంత ఇతర సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: “పుష్ప” లాగానే… “రిలీజ్” అయిన నెలలోపే OTT లోకి వచ్చిన 12 సినిమాలు..!


End of Article

You may also like