దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. సమంత ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా, హాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Video Advertisement

ఈ క్రమంలో సమంత ఒక్కో చిత్రానికి సుమారు 3-4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే సమంత నటించిన శాకుంతలం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమె ఒక యాడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్ గురించిన వార్త ఒకటి నెట్టింట్లో తిరుగుతోంది. అది ఏమిటో ఇపుడు చూద్దాం..
సమంత అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన అప్పటి నుండి ఆమె ఏం చేసినా? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఆమెకు సంబంధించిన చిన్న విషయం అయిన సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విడాకుల తరువాత ఆమె పెట్టే పోస్ట్ లపై నెటిజన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే  సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యింది. ఆమె సామాజిక మధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన పై ఎవరైనా  కామెంట్ చేసినా, వారికి ధీటుగా కౌంటర్ ఇస్తూనే ఉంది.
ఫ్యామిలీ మ్యాన్, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ పాటతో బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. యశోద మూవీ షూటింగ్ సమయంలో ఆమె అనారోగ్యానికి గురి అయిన విషయం అందరికి తెలిసిందే. అనారోగ్యంతోనే షూటింగ్ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి, ఆమె తన తరువాతి సినిమాల పై దృష్టి సారించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్ విషయం పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు. గతంలో పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్  కోసం సమంత కోటిన్నర పారితోషికం తీసుకుందంట. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 3-4 కోట్లు  పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక యాడ్ పోస్ట్ చేయడం కోసం ఇంతకు ముందు 8 లక్షలు తీసుకునేదట. ప్రస్తుతం ఆమె యాడ్ పోస్ట్ కి 20 లక్షలకు పెంచిందంట. సమంత ఇన్‌స్టాగ్రామ్ లో కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయడం కోసం 15- 20 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ .

Also Read: “కుష్బూ” నుండి… “సమంత” వరకు… అభిమానులు “గుడి” కట్టిన 10 హీరోయిన్స్..!