సమంత, నాగ చైతన్య తో విడి పోయినట్లు ప్రకటించి ఇప్పటికి సంవత్సరం దాటినా.. అప్పటి నుంచుయ్ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే చై-సామ్ విడాకులు సమంత కారణం గానే జరిగాయని రూమర్స్, ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. తర్వాత ఆమె తన అనారోగ్యం గురించి ప్రకటించిన అనంతరం సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

అయితే సమంత తన జీవితం లో బాధైనా సంతోషమైనా దాచుకోకుండా చూపించేస్తుంది. అలాగే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు సామ్. తన జిమ్ ట్రైనర్ జునైద్ కి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయనకు యశోద సక్సెస్ క్రెడిట్ ఇచ్చారు. ఆయన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ పోస్ట్ చేసింది సామ్.

samantha thanking her fitness trainer..
“యశోద సక్సెస్ తో నేను నా ఫెవరేట్ స్వీట్ జిలేబి తింటున్నాను. దీనంతటికి కారణం నీవే. గత కొన్ని నెలలుగా నాతో ఉన్న కొద్ది మందిలో నువ్వూ ఒకడివి. నా లోటు పాట్లు, కష్టనష్టాలు అన్నీ దగ్గరుండి చూశావు. లక్ష్యం మధ్యలో వదిలేయకుండా వెన్నంటి ఉన్నావు. మద్దతుగా నిలిచావు. నీకు కృతజ్ఞతలు..” అంటూ సామ్ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. సమంత ఆ పోస్ట్ లో అనారోగ్యంతో కూడా వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఒక చేతికి సిరంజీ ఉండగా మరో చేత్తో సమంత బరువులు ఎత్తున్నారు.

samantha thanking her fitness trainer..

కాగా సమంత నటించిన యశోద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శక ద్వయం హరి-హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక రోల్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా యశోద నవంబర్ 11న ఐదు భాషల్లో విడుదలైంది.