ప్రస్తుత కాలం లో వరుసగా రెండు హిట్స్ కొట్టడం కూడా కొంత మంది హీరోలకు గగనంగా మారింది. ఇండస్ట్రీ లో కొనసాగాలి అంటే బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ ను కొనసాగించడం ముఖ్యమనే సంగతి తెలిసిందే.అయితే వరుసగా బ్లాక్ బస్టర్లు రావాలంటే కాలం కూడా కలిసిరావాలి.

Video Advertisement

అయితే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏకంగా ఆరు సినిమాలు హిట్ అవడం అంటే మామూలు విషయం కాదు. కథ ఎంపిక దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్నీ ప్రతీ సారి పర్ఫెక్ట్‌గా సెట్ అయితేనే ఇలాంటి ఫీట్స్‌ సాధ్యమవుతాయి. అలా ఈ జనరేషన్ లో డబల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోలు ముగ్గురున్నారు.. వారు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, నాని, అడివి శేష్. ఈ అరుదైన రికార్డ్ ఈ ముగ్గురు హీరోలకే సొంతమైంది.

double hatrick hits by these tollywood heros..

నిన్ను చూడాలని చిత్రం తో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన ఎన్టీఆర్, స్టూడెంట్ నెంబర్ వన్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి `దమ్ము` నుంచి `రభస` వరకు వరుస ఫ్లాపుల్ని చూశారు. తర్వాత ‘టెంపర్’ తో కం బ్యాక్ ఇచ్చాడు తారక్. అప్పటి నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు తారక్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 30 వ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు.

double hatrick hits by these tollywood heros..

ఎన్టీఆర్ తరువాత నేచురల్ స్టార్ నాని వరుసగా ఆరు విజయాల్ని దక్కించుకున్నారు. పైసా నుంచి జెండాపై కపిరాజు వరుకు వరుస ఫ్లాపుల్ని చూసిన నాని ఆ తరువాత `ఎవడే సుబ్రమణ్యం` నుంచి హిట్ బాట పట్టాడు. ఆ తరువాత కామెడీ మూవీ భలే భలే మొగాడివోయ్‌, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ కృష్ణగాడి వీర ప్రేమగాథ, సస్పెన్స్ థ్రిల్లర్ జెంటిల్‌మెన్ సినిమాలతోనూ వరుస విజయాలు అందుకున్నారు నాని. ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్ కావటంతో నటుడిగానూ నాని రేంజ్‌ మారిపోయింది. అలా నిన్ను కోరి వరకు ఆరు హిట్స్ అందుకున్నాడు నాని.

double hatrick hits by these tollywood heros..

అలాగే లేటెస్ట్‌గా హిట్ 2 సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అడివి శేష్ కూడా వరుస సూపర్ హిట్స్‌తో కమర్షియల్‌ స్పేస్‌లోనూ సత్తాచాటుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురుకావటంతో తన కోసం తానే ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే క్షణం. అప్పటి నుంచి వచ్చిన అమీ తుమీ, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 లతో హ్యాట్రిక్ హీరోల సరసన చేరిపోయారు శేష్.