“మహేష్ బాబు” కి, “జూనియర్ ఎన్టీఆర్” కి… ఈ 4 విషయాలు ఒకే లాగా జరిగాయా..?

“మహేష్ బాబు” కి, “జూనియర్ ఎన్టీఆర్” కి… ఈ 4 విషయాలు ఒకే లాగా జరిగాయా..?

by Anudeep

Ads

తెలుగు సినిమా అగ్ర క‌థా నాయకుల్లో ఒక‌రైన మ‌హేష్ బాబు ఇంట కొంతకాలం క్రితం విషాదం నెల‌కొంది. ఒకరి తర్వాత ఒకరుగా ఆప్తులు మహేష్ బాబుకి దూరం అయ్యారు. మహేష్ బాబు తండ్రి అలాగే అప్పటి సీనియర్ స్టార్ హీరో కృష్ణ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ గారికి తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యింది అని వైద్యులు తెలిపారు.

Video Advertisement

ఆయ‌న అమ్మ‌గారైన శ్రీమ‌తి ఇందిరా దేవి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. పరిస్థితి చేయి దాటడంతో కొంతకాలం క్రితం ఆమె క‌న్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ లో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి జరిగిన కొన్ని విషయాలే.. సేమ్ మహేష్ కు రిపీట్ అవుతున్నాయా అని జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

#1 2014 లో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకి రామ్ మరణించారు. అలాగే కొన్ని నెలల క్రితం మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించారు.

are these four incidents same for jr.NTR and mahesh babu

#2 ఆ తర్వాత అన్న చనిపోయిన నాలుగేళ్లకు ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా ఒక ప్రమాదం లో మరణించారు. అన్న చనిపోయిన కొన్ని నెలలకి మహేష్ బాబు తల్లి మరణించారు.

#3 హరి కృష్ణ మరణించే సమయానికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ;అరవింద సమేత వీర రాఘవ’ చిత్ర షూటింగ్ లో ఉన్నారు. ఆ చిత్రం పూర్తైన తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే ఈ చిత్రం తర్వాత మహేష్ తో దర్శక ధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో ఒక చిత్రం చేయనున్నారని వెల్లడించారు.

are these four incidents same for jr.NTR and mahesh babu

#4 అదే విధంగా ప్రస్తుతం మహేష్ కి కూడా అవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం లో ఆయన సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. అలాగే ఇప్పుడు మహేష్ తండ్రి కృష్ణ కూడా మరణించారు. అలాగే ఎన్టీఆర్ కి ‘అరవింద సమేత’ 28 వ చిత్రం కాగా, రాజమౌళి తో చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ 29 వ చిత్రం. సేమ్ మహేష్ కి కూడా త్రివిక్రమ్ చిత్రం 28 వది కాగా, రాజమౌళి చిత్రం 29 వది.

are these four incidents same for jr.NTR and mahesh babu
ఈ విషయాలు చూసిన నెటిజన్లు నిజమే కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నాలుగు విషయాలు, ఈ ఇద్దరి స్టార్ హీరోల విషయంలో ఒకేలా జరిగాయంటే ఆశ్చర్యమే కదా..

ALSO READ : “ఇంక మెసేజ్ లు లేవు… మాస్ మాత్రమే..!” అంటూ… మహేష్ బాబు “గుంటూరు కారం” మాస్ స్ట్రైక్ వీడియోపై 15 మీమ్స్..!


End of Article

You may also like