ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో ఏ భాష సినిమా నుండి ఏం కాపీ చేసినా, వెంటనే తెలిసిపోతోంది. ఆ పాట కానీ, సీన్ కానీ, స్టోరీ కానీ ఏదైనా సరే నెటిజెన్లు వెతికిమరి ఒరిజినల్ మీమ్స్, ట్రోల్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మొన్న యోగి పాట ఒరిజినల్ కూడా ఆ విధంగానే ట్రెండింగ్ లోకి వచ్చింది.

Video Advertisement

అలానే ప్రస్తుతం తెలుగు లేటెస్ట్ మూవీ సాంగ్ ‘సమ్మోహనుడా..’ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుండి సినీ సెలబ్రెటీలు కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. దీంతో నెటిజెన్లు ఈ పాట ఒరిజినల్ సాంగ్ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం రూల్స్‌ రంజన్‌. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఏ‌.ఎమ్‌ రత్నం పెద్ద కుమారుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 4 వారాల క్రితం ‘సమ్మోహనుడా’ సాంగ్ విడుదల అయ్యింది. ఈ సాంగ్ ను శ్రీయాగోషల్ పాడగా, అమ్‌రిష్ కంపోజ్ చేశారు. రిలీజ్ అయిన మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో కూడా అంతగా వ్యూస్ పొందలేదు.
అయితే పోను పోను, ఈ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్‌రిష్ ట్యూన్, శ్రీయా గోషల్ వాయిస్‌ నెటిజెన్ల ఆకట్టుకుంటోంది. విడుదల అయిన వారం తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్లో సంచలనంగా మారి, 15మిలియన్ వ్యూస్‌ను పొందింది. యూట్యూబ్‌ లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక సోషల్ మీడియా ఈ సాంగ్ రీల్స్‌లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఫేస్ బుక్ లో సిగ్మా మీమ్స్ అనే పేజీలో ఈ పాటతో పాటు ఒరిజినల్ హిందీ సాంగ్ ను కూడా షేర్ చేశారు. 2013లో విడుదలైన ఫక్రే  అనే హిందీ మూవీలోని సాంగ్ ట్యూన్ నే ‘సమ్మోహనుడా..’ కోసం కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.facebook.com/reel/946257093303261

Also Read: BOYS HOSTEL REVIEW : కన్నడలో లాగానే తెలుగులో కూడా ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!