సమోసా ఇలా కూడా తింటారా..? కొంతమందికి అలాగే ఇష్టమంట..!

సమోసా ఇలా కూడా తింటారా..? కొంతమందికి అలాగే ఇష్టమంట..!

by Mohana Priya

Ads

ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు సమోసా చుట్టూ ఉన్న భాగాన్ని తిని మధ్యలో కూర ఉన్న భాగాన్ని వదిలేసేవాళ్ళు. ఇంకొకళ్ళు సమోసా మధ్యలో కూర ఉన్న భాగాన్ని తిని చుట్టూ ఉన్న దాన్ని వదిలేసేవాళ్ళు. ఈ రెండు రకాలు కాకుండా ఇంకోరకం మనుషులు కూడా ఉంటారు సమోసా పైన ఉన్న భాగాన్ని తినేసి లోపల ఉన్న కూరని మాత్రమే వదిలేసేవాళ్ళు.

Video Advertisement

డో నట్, క్రోసెంట్స్ లాంటి ఫారిన్ వంటలని ఈమధ్య భారతదేశంలో కూడా తింటున్నారు. కానీ ఎంతైనా సమోసా సమోసా నే. మీరు కూడా సమోసా పైన ఉన్న భాగాన్ని అంతా తినేసి మధ్యలో వున్న కూరని మాత్రమే ఎప్పుడైనా వదిలేశారా? ఒకవేళ అదొక్కటే కాకపోయినా పైన చెప్పిన మూడు రకాల్లో ఒక్క దాంట్లో అయినా మీలో చాలా మంది కచ్చితంగా ఉంటారు.

పిజ్జా కూడా సమోసా తో పోలిస్తే తక్కువే. సమోసా లో ఎక్కువ మంది వాడే కూర ఆలుగడ్డ కూర. ఎక్కడో కొంత మంది తప్ప ఆలూ ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. కొందరైతే వారంలో ఏడు రోజులు ఆలుగడ్డ తిన్నామన్నా కూడా కూడా తింటారు. అలాంటి వాళ్ళు మాత్రం సమోసాలు కేవలం అందులో ఉన్న ఆలుగడ్డ కూర కోసం మాత్రమే తింటారు.

అలాంటి వాళ్ళని చూస్తే కూర మాత్రమే తినడానికి సమోసా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? కూర మాత్రమే సపరేట్ గా చేయించుకుని తినొచ్చు కదా? అని అనిపిస్తుంది. కొంతమంది అసలు సమోసా అంటేనే ఇష్టం లేదు అని చెప్తారు. కానీ మనం ఎప్పుడైనా టేస్ట్ చేయమని మన దగ్గర ఉన్న సమోసా ఇస్తే కూర కలవని భాగాన్ని చూసుకొని తింటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్లకి కూడా లోపల ఉన్న కూర ఇష్టం లేదు అని, సమోసా పై భాగాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారు అని.

అలా అబద్ధం చెప్పినందుకు వాళ్ళని కూడా ఏమీ అనలేము. ఎందుకంటే ఒకవేళ లోపల కూర లేకుండా ఉన్న సమోసా ని తిందాము అన్నా కూడా అసలు కూరలేని సమోసాలు ఉండవు. దాంతో వృధా చేయడం ఇష్టం లేక సమోసా నే తినడం మానేస్తారు. ఇలా ఎప్పుడైనా స్నేహితులు టేస్ట్ చేయమని ఇస్తే తమకు ఇష్టమైన సమోసా పైన భాగాన్ని మాత్రమే తింటారు.

ఏంటి సమోసా ని ఇన్ని రకాలుగా తింటారా? అని అనుకుంటున్నారా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా కూడా పైన చెప్పినన్ని విధాలుగా సమోసా తినే వాళ్ళు కచ్చితంగా ఉంటారు. ఎప్పుడైనా సరదాగా ఒక సారి మీ చుట్టుపక్కల సమోసా తినే వాళ్లని గమనించండి. మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు.

 


End of Article

You may also like