ఆ మార్పులు చేసి ఉంటె “సర్కారు వారి పాట” రిజల్ట్ మరోలా ఉండేది.. అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి..!

ఆ మార్పులు చేసి ఉంటె “సర్కారు వారి పాట” రిజల్ట్ మరోలా ఉండేది.. అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి..!

by Anudeep

Ads

రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గాను పరశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గాను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మాణ సారథ్యం వహించారు. మన సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీత దర్శకత్వం వహించారు.

Video Advertisement

“మహేష్ బాబు ఈ సినిమాలో చాలా బాగా నటించారు, చాలా కొత్తగా కనిపించారు” అని కొందరు అంటూ ఉంటే, ఇంకొంతమంది, “కథలో కొత్తదనం లేదు” అంటున్నారు. మొత్తం మీద ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

sarkaruvaripata 1

పోస్ట్ పాండెమిక్ తరువాత ఈ సినిమా కూడా విజయం సాధించిన సినిమాల లిస్ట్ లోనే ఉంది. తాజాగా.. ఈ సినిమా గురించి సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “పరుచూరి పాఠాలు” పేరిట ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సినిమా టైటిల్ “సర్కారు వారి పాట” ను చూస్తే సర్కారు వారి పాట వల్లే ఏదో సమస్య జరిగి ఉంటుంది అన్న విషయం చూచాయగా అర్ధం అయిపోతుంది.

ఒకప్పటి రోజుల్లో అయితే.. ఇలా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళని ఉద్దేశించి “దేశ ద్రోహులు” టైపు లో పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మోడరన్ నేటివిటీ కి తగ్గ టైటిల్ కానీ, లేదా ఇంగ్లీష్ లో అయినా పెట్టొచ్చని అన్నారు. పదిహేను వేలు అప్పు తీసుకున్న తల్లితండ్రులు ఆ అప్పు కట్టలేక ప్రాణాలు తీసుకున్నారు. కొడుకు అమెరికాకు వెళ్లి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హీరోకు, హీరోయిన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

అయితే హీరోకు, హీరోయిన్ కు మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యని సడన్ గా వ్యవస్థాగత సమస్యగా మార్పు చేసి సినిమాను నడిపించారు. ఈ మార్పు మొత్తం సినిమానే మార్చేసింది. అలా కాకుండా తీసి ఉంటె.. ఇప్పుడు చేసిన వసూళ్ల కంటే మరింత ఎక్కువే ఈ సినిమా వసూలు చేయగలిగేది అని పరుచూరి గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like