“సర్కారు వారి పాట” సినిమాలో ఇది గమనించారా? చూసుకోవాలి కదా డైరెక్టరూ..!

“సర్కారు వారి పాట” సినిమాలో ఇది గమనించారా? చూసుకోవాలి కదా డైరెక్టరూ..!

by Anudeep

Ads

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ రోజు రోజుకు యంగ్ గా మారిపోతోంది. ఆయనకు నలభై ఏళ్ళు దాటాయంటే ఎవ్వరూ నమ్మరు. ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ తక్కువేమి కాదు. ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే మహేష్ పైన మనసు పారేసుకునే అమ్మాయిలు చాలా మందే ఉన్నారండోయ్..

Video Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట సినిమాలో చాలా యంగ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన కొన్నాళ్ళకి ప్రైమ్ లో కూడా అందుబాటులోకి వచ్చేసిన సంగతి తెలిసిందే.

keerthi suresh

“మహేష్ బాబు ఈ సినిమాలో చాలా బాగా నటించారు, చాలా కొత్తగా కనిపించారు” అని అంటూ ఉంటే, ఇంకొంతమంది, “కథలో కొత్తదనం లేదు” అంటున్నారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సినిమాకి పాటలు ఒక ముఖ్య హైలైట్‌గా నిలిచాయి.

Also Read: “రాజమౌళి” సినిమా కోసం… “మహేష్ బాబు” ఈ కండిషన్ పెట్టారా..?

ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబుని డబ్బు కోసం మోసం చేస్తుంది. తాను మోడరన్ అమ్మాయి అయినా ట్రెడిషనల్ అమ్మాయిలా మహేష్ బాబుకి పరిచయం అవుతుంది. అయితే.. ఇలా పరిచయం అయినప్పుడే.. ఆమె బస్సు కి లేట్ అవుతోంది అని పరిగెత్తుతూ వెళ్లి బస్సు ఎక్కేస్తుంది. తర్వాత వెనక్కి తిరిగి మహేష్ బాబుని చూస్తుంది. ఆ సన్నివేశంలో కీర్తి సురేష్ మెడలో ఓ ఐడి కార్డు కనిపిస్తుంది. నిజానికి అందరు అది కాలేజీ ఐడి కార్డు అని అనుకుంటారు. కానీ, అది మైత్రి మూవీ మేకర్స్ వారి ఐడి కార్డు.

Also Read: విడాకుల రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర, శ్రవణ భార్గవి..! ఇది మంచి విషయమే అంటూ..?

sarkaru vaari paata scene

ఇటీవల ఓటిటిలో ఈ సినిమా విడుదల అయిన తరువాత అందరు ఈ సినిమాను చూస్తున్నారు. థియేటర్లో చూసినప్పుడు అంతగా అనిపించకపోయినా.. ఫోన్లో చూస్తున్నప్పుడు ఇలాంటివి ఈజీగా తెలిసిపోతుంటాయి. అమెరికాలో మైత్రి మూవీ మేకర్స్ కి యూనివర్సిటీ ఉందా? అంటూ ఇది చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 45 ఏళ్ళు దాటుతున్నా నటుడు సుబ్బరాజు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!


End of Article

You may also like