ట్యూబ్ లెస్ టైర్ పంక్చర్ రిపేర్ చేసేటపుడు ఇంత మోసం జరుగుతుందా..? ఇది తప్పక తెలుసుకోండి…!

ట్యూబ్ లెస్ టైర్ పంక్చర్ రిపేర్ చేసేటపుడు ఇంత మోసం జరుగుతుందా..? ఇది తప్పక తెలుసుకోండి…!

by Mohana Priya

Ads

మనం సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నపుడు మన బైక్ టైర్ కి గాలి కొట్టిచ్చుకోవడానికి లేదా పంక్చర్ వేయించుకోవడానికి ఏదైనా షాపు దగ్గర ఆగుతాం. మనకి తెలియని వాళ్ళ షాప్ అయినా పెద్దగా పట్టించుకోము.

Video Advertisement

అయితే, ఇది తెలిసే చాలా మంది రోడ్ సైడ్ పంక్చర్లు వేసేవారు మోసం చేస్తూ ఉంటారట. ఇలా రోడ్ సైడ్ పంక్చర్ షాపుల్లో మనకి తెలియకుండా జరిగే మోసాల గురించి ఓ కోరా యూజర్ ఏమి చెప్పాడో మనం తెలుసుకుందాము.

కోరా యూజర్ తెలిపిన కధనం ప్రకారం, జనరల్ గా మనం ఇలా గాలి కొట్టించడానికి ఆగినప్పుడు.. వారు గాలిని చెక్ చేస్తూ.. మీ టైర్ పంక్చర్ అయిందని చెబుతారు. మీ టైర్ లో గాలిని నింపలేరు. దీనితో మీరు పంక్చర్ రిపేర్ ని కూడా వారినే చేయమని చెబుతారు. దీనిని వారు అవకాశం గా తీసుకుని మీ టైర్ ను రిపేర్ చేయడం మొదలు పెడతారు. మొదటగా, వారు మీ టైర్ ని నీటిలో ముంచుతారు. అయితే ఈ క్రమం లో వారు మరిన్ని చోట్ల మీరు గమనించకుండా హొల్స్ చేస్తారు. ఒకవేళ రిపేర్ షాప్ లో ఇద్దరు ఉన్నట్లయితే.. ఒకరు రిపేర్ చేస్తుండగా.. మరొకరు మిమ్మల్ని మాటల్లో పెట్టేస్తారు. ఒక దానికి రిపేర్ చేయాల్సింది.. వారు ఐదు ఉన్నాయని మీకు చూపిస్తారు.

వారు సబ్బు నీరు లేదా ENO కలిపి నీటిని వాడే అవకాశం ఉందని కోరా యూజర్ తెలిపాడు. ఇలాంటి నీరు మీకు బుడగలను చూపిస్తుంది. దానితో.. మీరు టైర్ పంక్చర్ అయిందని నమ్ముతారు. ఫలితం గా ఒక పంక్చర్ కి వంద చొప్పున మీ దగ్గర నుంచి ఐదు వందల రూపాయలను వసూలు చేస్తారు. మీరు డబ్బుని ఎక్కువ మొత్తం లో చెల్లించాల్సి వస్తుంది.. అంతే కాకుండా మీ టైర్ కూడా పాడవుతుంది. ట్యూబ్ లెస్ టైర్ రిపేర్ కి కొంత ఎక్కువే వసూలు చేస్తారు.

tyre puncture

అందుకే, మీరు రోడ్ సైడ్ రిపేర్ చేయించే క్రమం లో అప్రమత్తంగా ఉండి.. దగ్గరుండి చేయించుకోవడం మంచిది. అందరు మెకానిక్ లు ఇలానే చేయకపోవచ్చని.. తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురైందని కోరా యూజర్ తెలిపారు. కష్ట పడేవాళ్ళు ఉంటారు.. కానీ కొందరు ఇదే అవకాశం గా తీసుకుని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అందుకే జాగ్రత్త తప్పనిసరి.


End of Article

You may also like