సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రాబోతున్న సినిమా సర్కారు వారి పాట అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. ఆ రోజు కచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తారు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ను ఇవాళ విడుదల చేసారు.

Sarkaru vaari paata first look

ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు ఒక రెడ్ కలర్ కార్ లో కూర్చొని కనిపిస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. అంతే కాకుండా ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుంది అని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

sarkaru vaari paata

ఇప్పటికి ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లు విడుదల అయ్యాయి. ఈ రెండు పోస్టర్లను చూసి ది హ్యూమర్ గ్యాంగ్ పేజీ వారు ఏకం గా అక్కడ సీన్ ఏమై ఉంటుందో చెప్పేసారు. ఫస్ట్ పోస్టర్ లో విలన్ కింద పడిపోయినట్లు చూపించారు. సెకండ్ పోస్టర్ లో మహేష్ కూర్చున్న కార్ అద్దం పగిలి ఉంది. దీనిని బట్టి విలన్ కార్ అద్దం పగలగొట్టినందుకు.. మహేష్ విలన్ ని కొడతాడు.. అంటూ సీన్ ని ఊహించేస్తున్నారు. ఇంతకీ అసలు సీన్ ఏంటి అన్నది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. కాబట్టి.. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.

sarkaru vaari pata 2