సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష.గత వారం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే తోపాటు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాడు.
Video Advertisement
అందరూ అనుకుంటున్నట్లు కార్తీక్ దండుకి విరుపాక్ష మొదటి సినిమా కాదు, ఇది అతని రెండో సినిమా. ఎనిమిదేళ్ల క్రితమే దర్శకుడిగా మొదటి సినిమా చేసిన కార్తీక్ దండు, 2015లో ‘భం భోలేనాథ్’ అనే సినిమా చేశాడు. నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. అలాగే 2014లో వచ్చిన నిఖిల్ ‘కార్తికేయ’ సినిమాకి మూల కథని అందించారట కార్తీక్ దండు.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ దండు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ” భం భోలేనాథ్ తో డైరెక్ట్ గా మారాను కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో విరూపాక్ష కథ రెడీ చేసుకున్నాను. సుకుమార్ దగ్గరికి వెళ్లి స్టోరీ వినిపించాను ఆయనకు బాగా నచ్చడంతో సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తానని అన్నారు. అలాగే మూవీ లో కొన్ని చేంజెస్ చెప్పారు. సుకుమార్ సర్‌ని కలిసిన తర్వాత కనీసం 6, 7 స్క్రీన్‌ప్లే వెర్షన్‌లు రాసుకున్నాం. ప్రధాన కథనాన్ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు.
క్లైమాక్స్ ఐడియా కూడా సుకుమార్ గారిదే.అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ విలన్ నే సుకుమార్ గారు మార్చేశారు. అలాగే సినిమాలో కనిపించిన యూనిక్ మర్డర్ సన్నివేశాలు కూడా ఆయనే సూచించారు.” అని దర్శకుడు కార్తీక్ తెలిపారు. విరూపాక్ష బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకు పోతుండడంతో కార్తీక్ దండుకి టాప్ బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తున్నాయట. అయితే తన నెక్స్ట్ మూవీ కూడా థ్రిల్లర్ జోనర్ లోనే చేయాలనుకుంటున్నాడట ఈ దర్శకుడు.
ఏదేమైనా మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మూవీ చేసి హిట్ కొట్టడం అంటే మాటలు కాదు. వేరే ఎవరైనా అయితే మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయే వాళ్లేమో. అలా వెళ్లకుండా ఇక్కడే ఉంటూ వచ్చాడు కాబట్టే ఈరోజు కార్తీక్ దండు ఖాతాలో విరుపాక్ష లాంటి సాలిడ్ హిట్ పడింది. మరి ఈ యంగ్ డైరెక్టర్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ తో మన ముందుకు వస్తాడో చూడాలి.