పూర్వకాలం నుండి చాలా పద్ధతులు నేటికి కూడా అనుసరించడం జరుగుతోంది. అయితే నిజానికి మన పూర్వీకులు పాటించే ఆచారాలు వెనుక సైన్స్ ఉంది.

Video Advertisement

ప్రతి మూఢనమ్మకం వెనక కూడా ఒక శాస్త్రీయ వాస్తవం దాగి ఉంది. అయితే మరి ఈ మూఢనమ్మకాల గురించి, వాటి వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

#1. నిమ్మకాయలని గుమ్మానికి కట్టడం:

పూర్వ కాలం నుండి కూడా నిమ్మకాయలని గుమ్మానికి కట్టడం జరుగుతోంది. దానివల్ల దుష్టశక్తి రాదని నమ్ముతూ ఉంటారు. అయితే గుమ్మానికి నిమ్మకాయలు కట్టడం వెనుక సైన్స్ ఉంది. అదేమిటంటే నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీంతో వాటిని గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి క్రిములు, కీటకాలు రావు.

#2. రాత్రిపూట గోళ్ళు కత్తిరించడం:

మన పెద్దలు చెప్తూ ఉంటారు రాత్రిపూట గోళ్ళని కట్ చేయొద్దు అని. అయితే ఎందుకు రాత్రిపూట గోళ్లు కట్ చేయకూడదు..? దీని వెనక ఉండే సైన్స్ ఏమిటి అని చూస్తే.. పూర్వం కరెంటు ఉండేది కాదు. దీనితో వాళ్ళు గోళ్ళని కత్తిరించడానికి పనిముట్లను ఉపయోగించేవారు. కరెంట్ లేకపోవడం వల్ల చీకట్లో గోళ్ళను కత్తిరించుకుంటే గోళ్ళకి ఇబ్బంది కలగొచ్చు అని ఇలా చెప్పేవారు.

#3. గ్రహణ సమయంలో బయటకి వెళ్లకపోవడం:

గ్రహణం వేళలో బయటికి వెళ్లకూడదని.. దుష్టశక్తులు బయట ఉంటాయని పెద్దలు చెప్పటం మనం వినే ఉంటాం. అయితే నిజానికి దాని వెనక సైన్స్ ఉంది. అది ఏంటంటే గ్రహణ సమయంలో సూర్యుడి కిరణాలు మన చర్మానికి హాని చేస్తాయి. దీంతో చర్మ వ్యాధులు వంటివి వస్తాయి. అలానే సూర్యగ్రహణం కళ్ళతో చూడడం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది, అందుకనే గ్రహణం వేళలో బయటకు వెళ్లకూడదు అంటారు.

#4. పాముని చంపాక తల నరకడం:

ఎప్పుడైనా ఎవరైనా పాముని చంపితే.. దాని తలని కూడా నరికేయాలి అని మూఢ నమ్మకం ఉంది. అయితే దీని వెనుక సైన్స్ కూడా ఉంది. అది ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా పాము విషం వల్ల మనుషులకు హాని కలుగుతుంది. అందుకనే నరికేసిన తర్వాత పాముని పాతిపెడతారు. అయితే నిజానికి పాముని చంపడం మంచిది కాదు. పాములు పట్టే వాళ్ళకి కానీ అటవీశాఖ అధికారులకు కానీ తెలియజేయాలి.