ఆడవాళ్లు పెట్టుకునే ఈ 9 ఆభరణాల వెనకున్న అసలు కారణం ఏంటో తెలుసా.?

ఆడవాళ్లు పెట్టుకునే ఈ 9 ఆభరణాల వెనకున్న అసలు కారణం ఏంటో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రపంచంలో దాదాపు 90 శాతం మంది ఆడవాళ్లు ఇష్టపడేది నగలు. అవి సింపుల్ వి అయినా కావచ్చు లేదా హెవీ అయినా కావచ్చు చాలా మందికి ఏదో ఒక ఆభరణం అంటే ఇష్టం ఉండి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ స్త్రీలకి. నగలు పెట్టుకోవడానికి కారణం అలంకారం అని అనుకుంటాం. కానీ కాదు. ప్రతి ఆభరణం పెట్టుకోవడం వెనక ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి. అవేంటంటే.

Video Advertisement

పాపిడి బిళ్ళ

నుదురు శరీరం మొత్తానికి కేంద్రం. ఏడు చక్రాల్లో మొదటి చక్రం నుదురు దగ్గర ఉంటుంది. మన మెదడులో ఉండే ఆలోచనలు అన్నీ అక్కడే స్టోర్ అయి ఉంటాయి. ఇంకా నుదురు దగ్గర రెండు భాగాలు ఉంటాయి. అవి రెండూ పాపిడిబిళ్ళ పెట్టుకునే ప్రదేశంలో కలుస్తాయి. ఒక భాగం ఆడవాళ్ళని ఇంకొక భాగం మగవాళ్ళని సూచిస్తుంది. మామూలుగా చెప్పాలంటే అర్ధనారీశ్వర అంటారు. ఆ రెండు భాగాలు విడిపోకుండా ఉండడానికి పాపిడి బిళ్ళ పెట్టుకుంటారు.

ముక్కుపుడక

ఆడవాళ్లకి డెలివరీ టైమ్ లో ఎంతో నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముక్కు కుట్టించుకున్నప్పుడు కూడా అంతే నొప్పిగా ఉంటుంది. దాంతో ఒకవేళ భవిష్యత్తులో అలా ముక్కు కుట్టించుకున్న ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయితే డెలివరీ టైమ్ లో అంతగా నొప్పి అనిపించదు ఎందుకంటే ఒకసారి ముక్కు పుడక కుట్టించుకున్నప్పుడు దాదాపు అలాంటి నొప్పి భరించారు కాబట్టి డెలివరీ అప్పుడు వచ్చే నొప్పిని తట్టుకోగలుగుతారు అని డాక్టర్ల నమ్మకం.

ఇయర్ రింగ్స్

శరీరంలోకి నెగిటివ్ ఎనర్జీ లేదా చెడు శక్తులు ప్రవేశించాలంటే చెవుల్లో నుండే ప్రవేశిస్తాయి. అందుకే చెవుల దిద్దులు పెట్టుకోవడం వల్ల అలాంటి శక్తులు రాకుండా ఉంటాయి అని నమ్ముతారు. అదే కాకుండా సైన్స్ పరంగా కూడా ఇంకో కారణం ఉంది. చెవుల్లో మెదడుని, కిడ్నీలను, బ్లాడర్ ని కలిపే కొన్ని నరాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం చెవుల మీద ఒత్తిడి పెడతామో అప్పుడు ఆ భాగాలు సరిగ్గా ఫంక్షన్ అవుతాయి. దాంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

గొలుసు

గొలుసు వేసుకోవడం వల్ల హార్ట్ ప్రెషర్ తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అదే కాకుండా చెడు భావాలని (ఎమోషన్స్ ని) దూరంగా ఉంచుతాయి. దాంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.మంగళ సూత్రం కూడా గొలుసు కోవకే చెందుతుంది. కాబట్టి పెళ్లి అయిన వాళ్ళు వేసుకునే మంగళ సూత్రం గుండెని మెదడు ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు ఆలోచనలు రానివ్వదు.

గాజులు

మనిషి శరీరంలో జనరేట్ అయ్యే రేడియేషన్స్ చేతుల పై ఉన్న చర్మం నుండి బయటికి వచ్చి అరిచేతి మీద నుండి విడుదల అవుతాయి. గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్స్ బయటికి వెళ్లకుండా ఉంటాయి. ఎందుకంటే గాజులు సర్కిల్ ఆకారంలో ఉంటాయి కాబట్టి ఎండ్ అనేది ఉండదు అందుకే రేడియేషన్స్ బయటికి వెళ్ళలేవు.

వడ్డానం

శరీరంలో ఎక్కువగా కొవ్వు నిలిచిపోయే ప్రాంతం నడుము భాగం. వడ్డానం పెట్టుకోవడం వల్ల ఫ్యాట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాంతో అధిక బరువు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి.

ఉంగరాలు

సాధారణంగా చిటికెన వేలు పక్కనున్నవేలికి ఉంగరం పెడతారు కాబట్టి ఆ వేలిని ఉంగరం వేలు అంటారు. ఉంగరం పెట్టుకొనే వేలి నుండి గుండెకి ఇంకా మెదడుకి కనెక్ట్  చేసే నరం ఉంటుంది. దాంతో ఏది ఆలోచించినా దృష్టి అంతా కేంద్రీకృతం చేసి ఆలోచిస్తారు. ఉంగరం బొటన వేలికి పెట్టుకుంటే ఎదుటి వారు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయట.

ఉంగరం మధ్య వేలికి పెట్టుకుంటే మధ్య వేలినుండి మెదడు యొక్క ఒక రెండు భాగాలని కలిపే నరం అనేది కదిలి ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. ఏ విషయం మీద అయినా తొందరగా నిర్ణయం తీసుకోలేరు. దాంతో మెదడు మీద ఒత్తిడి పెరిగి ఓవర్ థింకింగ్ అలవాటయ్యే అవకాశాలు ఉన్నాయి.

పట్టీలు

కాళ్ల నీ మడమ ని కలిపే భాగంలో పట్టీలు పెట్టుకుంటారు. సాధారణంగా పట్టీలు వెండితో తయారు చేస్తారు ఎందుకంటే వెండి తో భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అందువల్ల భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ బయటికి వస్తుంది. అంతేకాకుండా పట్టీలు పెట్టుకోవడం వల్ల కీళ్ల నొప్పులు రావట. పట్టీల శబ్దం వల్ల చెడు శక్తులు దూరంగా ఉంటాయి అని అంటారు.

మెట్టెలు

మెట్టెలు పెట్టుకునే వేళ్ళ నరాలు గుండె కి కనెక్ట్ అయి ఉంటాయి. దాంతో ఆ వేలికి ఆభరణం (మెట్టెలు) పెట్టడం వల్ల గుండె కి కనెక్ట్ అయి ఉన్న నరాలు ఆక్టివేట్ అయ్యి మొత్తం శరీరం యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది సమానం గా ఉంటుంది అని నమ్ముతారు.

ఇప్పటివరకు నగలు అనేది ఇష్టంతో వేసుకునేవి మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నగ కి ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఒక్క భారత దేశ స్త్రీలే కాకుండా వేరే దేశం వాళ్ళు కూడా బంగారంతో కాకపోయినా ప్లాటినం లాంటి లోహాలతో తయారయ్యే నగలు వేసుకుంటారు.


End of Article

You may also like