విడాకులు రాకుండా రెండవ పెళ్లి చేసుకోవచ్చా..? చట్టం ఏం చెప్తోంది..?

విడాకులు రాకుండా రెండవ పెళ్లి చేసుకోవచ్చా..? చట్టం ఏం చెప్తోంది..?

by kavitha

Ads

విడాకులు అనే మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. విడాకులు రాకుండా రెండవ పెళ్లి చేసుకోవచ్చా, అలా చేసుకున్న వారి విషయంలో చట్టం ఏం చెబుతుంది అనేది ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్నప్పుడు, ఆ వివాహ బంధాన్ని పునరుద్ధరించడం వీలు  కానప్పుడు మాత్రమే సాధారణంగా విడాకులు మంజూరు చేస్తారు. అయితే కొందరు విడాకులు రాకుండా రెండవ వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవి లీగల్ యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి న్యాయవాది ఆకుల రమ్యకుమారి గారు ఇలా సమాధానం ఇచ్చారు.
Second-Marriage-Without-Divorceచట్ట ప్రకారం వివాహం జరిగిన తరువాత భార్య లేదా భర్త నుండి విడాకులు రాకుండా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అవుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక  IPC సెక్షన్ 494 ప్రకారం బైగమీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు రెండవ వివాహం చెల్లదు. అంటే చట్ట ప్రకారం పెళ్లి జరిగిన తరువాత ఆ వ్యక్తి ఇంకొక పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా విడాకులు రావాల్సిందే.
ఈ విషయం తెలియక చాలా మంది, లేదా ఏం చేస్తారులే అనుకుని రెండవ పెళ్లి చేసుకుంటుంటారు. ఒకవేళ భార్య లేదా భర్త రెండవ పెళ్లి చేసుకున్న భర్త లేదా భర్త మీద కేసు నమోదు చేసే హక్కు ఉంటుందని వెల్లడించారు. అలాంటి సమయంలో రెండవ పెళ్లి చేసుకున్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షపడుతుంది.హిందూ వివాహచట్టం ప్రకారంగా డైవర్స్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఒప్పుకుంటూ భర్త లేదా  భార్య ప్రమాణ పత్రాన్ని ఇచ్చినట్లు అయితే వారి పెళ్లి రద్దువుతుంది. కానీ, విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా రెండవ వివాహం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి

Also Read: ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!


End of Article

You may also like