ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోయిన్ గా చలామణి అవుతున్న నటి సమంత. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ఖుషి సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఖుషి సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Video Advertisement

మొన్న స్టేజిపై విజయ్ దేవరకొండ తో సమంత చేసిన హాట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆన్లైన్ లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈవెంట్లో సమంత పార్టిసిపేట్ చేయడంతో ఖుషి మూవీ పై బజ్ పెరగడమే కాకుండా సినిమా బయట ఇంత కెమిస్ట్రీ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అన్న టాక్ కూడా ఎక్కువ అయింది.

మాయోసైటిస్ అని అరుదైన జబ్బుతో బాధపడుతున్న సమంత గత కొద్ది కాలంగా సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆరోగ్యం పైపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం సమంతకు అలవాటే.

samantha water

తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో ఎప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉండే సమంత కొత్త ప్రేమ అని పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఒక గ్లాస్ లో ఉన్న వాటర్ ని చేతిలో పట్టుకొని తీసుకున్న ఫోటో కింద కొత్త ప్రేమ అనే పదం యాడ్ చేసి సమంత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ గ్లాస్ పట్టుకున్న సమంత చేతికి లవ్ అనే అక్షరాలతో కూడిన బ్రాస్లెట్ కూడా ఉంది. మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నాను…అని సమంత పెట్టిన పోస్ట్ వెనక అంతరార్థం ఏమిటో ఎవరికి అర్థం కావడం. నీటిని ప్రేమించడం ఏమిటి.. దీని వెనక కథ వేరే ఉంది అని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు.

ALSO READ : “సామజవరగమన” లో ఈ సీన్ ఎందుకు డిలీట్ చేసారో.? “వెన్నెల కిశోర్” కామెడీ మాములుగా లేదుగా.?