మెగా ఇంటి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేమైన పరిచయం అక్కర్లేదు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన మేనేజ్‌మెంట్ పనులు చూసుకుంటూనే.. మరోవైపు మెగా ఇంటి కోడలిగా ఉపాసన ఇంటి పనులు సక్సెస్‌ఫుల్‌గా చక్కబెడుతున్నారు.
Video Advertisement
అయితే పెళ్ళైన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు కానుండటం తో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రెగ్నన్సీ విషయం ప్రకటించినప్పటి నుంచి ఉపాసన, రామ్ చరణ్ జంటగా టూర్స్ కి వెళ్తున్నారు. అయితే ఉపాసన కి సీమంతం చేసారు. చరణ్, ఉపాసనకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కొందరు మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు.
అయితే తాజాగా ఉపాసన కోసం హైదరాబాద్ లోని ఆమె సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన మరొక వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఉపాసన పింక్ కలర్ డ్రెస్ ధరించడం తో ఈ జంటకి ఆడపిల్ల పుట్టనుందని అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే రామ్ చరణ్ కి పుట్టబోయేది అమ్మాయేనని తేలిపోయింది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ రూఢీ చేసినట్లు మిర్చి9 వెబ్‌సైట్ పేర్కొంది. రామ్‌చరణ్ జాతీయ మీడియా జర్నలిస్టుతో మాట్లాడుతూ ‘నా తొలి ప్రాణం ఉపాసన, రెండో ప్రాణం నా కుక్క రైమ్. ఇక మూడో ప్రాణం వస్తూ ఉంది’ అన్నారు. ఆ వీడియోను ఆ న్యూస్ పోర్టల్ పెట్టింది. ఈ విషయం లో నిజమెంతుందో తెలియాలంటే జులై వరకు వేచి ఉండాల్సిందే..
రామ్ చరణ్ సిస్టర్ సుస్మిత ఆ మధ్య ఉపాసనకు అబ్బాయి పుడితే బాగుండు అన్నారు. ఇప్పటికే మా ఫ్యామిలీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరు పుట్టినా ఓకే, అబ్బాయి పుడితే సో హ్యాపీ అన్నారు. అబ్బాయి పుడితే ఆ లోటు తీరుతుందని సుస్మిత తన అభిప్రాయం వెల్లడించారు. చిరంజీవి చిన్నమ్మాయి శ్రీజకు ఇద్దరు అమ్మాయిలు. సుస్మితకు కూడా ఇద్దరు అమ్మాయిలు. చిరంజీవికి మొదట సంతానంగా అమ్మాయి పుట్టింది. ఇలా చూసుకున్నా ఉపాసనకు అమ్మాయే పుడుతుందని అంటున్నారు.