నటుడు, దర్శకుడు, రచయిత మనోబాల మే 3వ తేదీన కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాల మరణించారు. ఆయన మరణం పై చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈయన అనేక చిత్రాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. ఆయన చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య.
Video Advertisement
అయితే ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోబాల జనవరిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. మనోబాల చివరి రోజుల్లో దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది.
మనోబాల యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియో ని అప్లోడ్ చేసారు ఆయన కుటుంబ సభ్యులు. ఇందులో మనోబాల ని మాట్లాడించటానికి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడ్డారు. ఎంత ప్రయత్నించినా ఆయన మాట్లాడలేకపోయారు. ఆయన కొడుకు హరీష్ ఒక పాటని పాడగా ఆయన విని సంతోషించారు. కదల లేని స్థితిలో ఉన్న ఆయనకు అసిస్టెంట్ భోజనం తినిపించారు.
సినిమాల్లో ఎంతో యాక్టీవ్ గా ఉండి.. అందర్నీ నవ్వించే మనోబాల ఇలా వీల్ చైర్ కే పరిమితం అవ్వడం చూసిన ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ వీడియో ని చూస్తే కన్నీళ్లు ఆగట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నటుడు దర్శకుడు అయిన మనోబాల కి ‘మనోబాల’స్ వేస్ట్ పేపర్’ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో తెరవెనుక జరిగే సరదా సంఘటనలు, సెలెబ్రెటీల ఇంటర్వ్యూ లు, రివ్యూస్ వంటి రకరకాల వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు.
మనోబాల లివర్ సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు సమాచారం. అయితే గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన అనారోగ్యం గురించి వెల్లడించారు. “నేను రోజుకి దాదాపు 100 నుంచి 200 సిగరెట్స్ తాగుతా.. దీంతో కాలేయం దెబ్బతిందని డాక్టర్స్ చెప్పారు. ఇప్పటివరకు సంపాదించినంత డబ్బంతా చికిత్స కోసమే ఉపయోగించా.. సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల చనిపోతానని ముందే వైద్యులు చెప్పారు..” అని గతంలో తెలిపారు మనోబాల.
watch video :